ఏంటా బరితెగింపు!?
మరి దారుణంకాకపోతే .. అధికారం చేతులో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తే ఎలా అన్న విమర్శలు నిత్యం అధికారపార్టీ నేతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్ ఇవే! అధికారులకు స్వేచ్ఛ లేదు. పోలీసులను వారి డ్యూటీ వారిని చేసుకోనివ్వరు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంపీ పోలీసు స్టేషన్ పై పడి నానా హంగామా చేసిన దాఖాలు ఎక్కడైన చూశామా? అంటే లేదు అన్న సమాధానలే వినిపిస్తుంటాయి! ఇటువంటివి కేవలం జగన్ రెడ్డి ఏలుబడిలో మాత్రమే చూస్తున్నాం అన్న విమర్శలు కూడా లేకపోలేదు! అర్థరాత్రి అల్లరిమూకలను అదుపులోకి తీసుకున్న పోలీసులపై ఒక ఎంపీ స్థాయి వ్యక్తి స్టేషన్ కు వెళ్లి.. దౌర్జన్యానికి దిగడం కడు శోచనీయం! అంతేకాక ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి కూడా చట్టాలను గౌరవించాల్సింది పోయి.. తన కళ్లముందు ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ పై దాడి చేయడం వంటి చర్యలను ఏమనాలి? దీనిని సభ్య సమాజం హర్షించదు! కనీస ఇంగితం లేకుండా దౌర్జన్యకాండకు పాల్పడటాన్ని ప్రజలు, అధికారులు ముక్తం కఠంతో ఖండిస్తున్నారు.
చట్టాలు మీకేమైనా చుట్టాలని రాసిచ్చారా??
అర్థరాత్రి ఫుట్ గా మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే.. పోలీసులు జోక్యం చేసుకోకూడదు! అంతేకాక పోలీసులు చేతులు కట్టుకుని, నోరుమెదపకుండా వారికి స్వాగతం పలకాలి! ఇది అధికార పార్టీ ఎంపీ నందిగం సురేష్ పాయింట్ ఆఫ్ వివ్ లో ఉన్న ‘లా’! ప్రజలకు మంచి పాలన అందిస్తూ.. చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకున్న ఎంపీ ఇలా పోలీసులపై దాడులకు పాల్పడటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో అర్థరాత్రి తాగుబోతు మూక ఒకటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. వారిని ఆపి స్టేషన్ కు తరలించారు. తాము నందిగం సురేష్ అనుచరులమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు చిక్కిన ప్రతి ఒక్కడు ఏదోఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పడం సహజమేనని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఆ తరువాత ఎంపీ నందిగం సురేష్ నేరుగా కృష్ణలంక పోలీసు స్టేషన్ వెళ్లారు. ఆ సమయంలో ఆయనను చూసి, అనుచరులు ఇంకా రెచ్చిపోయారు! ఎస్ఐపై వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై అనుచరులు దాడి చేశారు. కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని వెళ్లెందుకు ప్రయత్నించగా.. ఫోన్ అడిగిన సదురు కానిస్టేబుల్ శ్రీనివాస్ పై మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఇలా పోలీసు స్టేషన్ లోపల, బయట కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఎంపీ అనుచరులు దాడిచేస్తున్న సమయంలో ఎంపీ సురేష్ అక్కడే ఉన్నారు. కనీసం వారిని వారించకపోవడం గమనార్హం! కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ యువకుల్లో ఎంపీ సురేష్ సమీప బంధువు ఉన్నట్లు సమాచారం! మొత్తానికి ఎంపీ సురేష్, ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాన్ని ప్రజలు ఖండిస్తున్నారు.
Must Read:-కలెక్టర్ వీడియో కాన్ఫిరెన్స్‌లో ఉన్న తహసీల్దార్ పై వైసీపీ సర్పంచ్ దాడి!