మాట వినకుంటే చేతలతో సమాధానం!
జగన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు రాక్షస పాలనను చివిచూస్తున్నారు. ఎంత దారుణమంటే ప్రశ్నిస్తే పగ పట్టిమరి చెరసాలు పాలు చేసే సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. నియంతృత్వం పొకడలు ప్రజాస్వామ్యంలో చెల్లవని తెలిసి కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై, విపక్షాలపై, అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఇటువంటి దురాఘతాలను పాలించాల్సిన పాలకులు ప్రోత్సహిస్తుంటే.. పోలీసులు పీడిత పక్షాన నిలుస్తున్నారు. ఇటువంటి దారుణాలు ఏపీలో ఎన్నడూ చూడలేదని సామాన్య ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ దౌర్జన్యాలకు కొలమానం లేదు. వీరిని ప్రశ్నిస్తే పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. నిలదీస్తే అధికార నిషా నశాలనికి ఎక్కి ఉన్మాదుల్లా ఎగపడతారు. గత ఏడాది డిసెంబర్ లో వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని అనుచరుడు సుభాని దాడిచేసి దారుణంగా అవమానించాడు. దాడి ఘటనను వీడియా తీసి మరి హీరోయిజం ప్రదర్శించాడు. తాజాగా ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలం సర్వసభ్య సమావేశంలో దాసరిపల్లి సర్పంచ్ భవనం కృష్టారెడ్డి తహసీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేశాడు. కిందపడేసి మరి కొట్టాడు. ‘‘ ఏరా వైసీపీ నాయకులంటే లెక్క లేదా మీకు.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు.
కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, పక్కన పోలీసులుంటే మాకేంటి?
రాష్ట్రంలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయి! మండల కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు అధికారపార్టీ నాయకులు చెప్పిది వేదం! మేం చిటికెస్తే నిలబడాలి, కూర్చోమంటేనే కూర్చొవాలి.. అంతేకాని మీకిష్టమొచ్చినట్లు రూల్స్ మాట్లాడితే కుదరదు అన్నది అధికార వైసీపీ వర్షన్! హనుమంతునిపాడు మండల తహసీల్దార్ నాగార్జునరెడ్డి పై జరిగిన దాడి కూడా ఇదే తరహా దౌర్జన్యకాండే! తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి తహసీల్దార్ హాజరుకాలేదు. ఆ సమయంతో ఆయన జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫిరెన్స్ లో ఉన్నాడు. వైపీసీ ప్రజా ప్రతినిధులు వస్తే.. తహసీల్దార్ రావడం కుదరడం లేదా? అంటూ అక్కడే ఉన్న అధికారులను ప్రశ్నించాడు. సర్పంచ్, ఎంపీటీసీ అంటే లెక్క లేదు రా మీకు అంటూ.. ఆగ్రహంతో అధికార పైత్యాన్ని తహసీల్దార్ పై ప్రదర్శించాడు. దాడి జరుగుతున్న సమయంలో పక్కనే పోలీసులున్నా ఏం చేయలేని పరిస్థితి వారిది. చివరికి తనపై జరిగిన దాడిని జిల్లా కలెక్టర్ కు, ఉన్నతాధికారులకు బాధిత తహసీల్దార్ ఫిర్యాదు చేశారు.