వి – సర్వే ఏం చెబుతోంది..
గుంటూరు జిల్లా చైతన్యవంతమైన రాజకీయాలకు పెట్టింది పేరు! అటువంటి జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికార వైసీపీ ఒక్కసీటు కూడా గెలవలేదు అన్నది అన్ని సర్వేలతో పాటు వి – సర్వే చెబుతున్న వాస్తవాలు! 2019 ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో రేపల్లే, గుంటూరు – వెస్ట్ నియోజకవర్గాలను తెలుగు దేశంపార్టీ గెలుపొందగా.. మిగిలిన 15 నియోజకవర్గాల్లో వైసీపీకి విజయకేతనం ఎగరవేసింది. జాకీలు తెచ్చి లేపిన గెలవని నియోజకవర్గ స్థానాల్లో సైతం వైసీపీ కొత్త ముఖాలు గాల్లో గెలిచేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే తాడికొండ, చిలకలూరిపేట, పొన్నూరు, పెదకూరపాడు, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ ఆ ప్రాంతానికి డెబ్యూ పొలిటిషియన్సే! ఇదిలా ఉంటే వైసీపీ గద్దెనెక్కిన ఆరునెలలు గడవక మునిపే కూల్చడం తో ప్రారంభించిన రాజకీయం.. రాజధాని పతనాని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చాడు సీఎం జగన్! దీంతో గుంటూరు జిల్లా రియల్ భూమ్ ఒక్కసారి పడిపోయింది. కోటి రూపాయాలు పలికే భూములు సైతం పది లక్షలకు కూడా అడిగివారు లేరు. మూడు రాజధానుల నిర్ణయం ఒక్క రియల్ ఎస్టేట్ పతనంతో ఆగలేదు.. దాని ప్రభావం అన్ని వ్యాపారాలపై పడింది. మరోవైపు గుంటూరు జిల్లాలో నేటికీ తెలుగు దేశం పార్టీ హయంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తుదే తప్ప.. వైసీపీ మార్క్ చూపే అభివృద్ధి ఒక్కటి కూడా జరగలేదు! అమలవుతున్న సంక్షేమం గెట్టెక్కిస్తోందని కలలు కంటున్న అధికార వైసీపీకి పెరుగుతున్న ధరలు, పడకేసిన అభివృద్ధి, కుంటుపడ్డ ఉపాధి, నడ్డివిరిగి రైతు బ్రతుకు చిత్రం వంటివి ఫుల్ మైనస్!
పల్నాడు ప్రాంతంలో ఫ్యాన్ గాలి రివర్స్!
జిల్లా పరిధిలో 17 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే.. అధికార వైసీపీ ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా గెలవదు అన్న సర్వేలు చెబుతున్న వాస్తవాలు. ‘వి – సర్వే’ గ్రాస్ రూట్ లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాలను సేకరించి.. తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం గుంటూరులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోబోతుంది అని చెప్పేసింది. అదే ఒక ఏడాది తరువాత ఎన్నికలకు పోతే.. గతంలో 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకొచ్చి రెండు అంకెల ఫిగర్ అధికార వైసీపీకి రిపిట్ అవుతోందని కూడా చెప్పింది. అయితే టీడీపీ ఆ రెండు స్థానాల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించి, ప్రచారంలో ముందుంటే అన్ని నియోజకవర్గాల్లో క్లిన్ స్విప్ చేసినా ఆశ్చర్యపొనక్కర్లేదు. మరోవైపు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీకి గాలి రివర్స్ లో తొలుతొంది! ‘వి – సర్వే’ నిర్వహించిన తాజా రిపోర్ట్ లో పల్నాడు బెల్ట్ లో అధికార పార్టీ పూర్తిగా పట్టుకోల్పొయిందని, ఇక్కడ తలకాయాలను మార్చిన గెలుపు అన్నది అసాధ్యమన్నది వెల్లడించింది. వినుకొండ, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాలలో అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమికి ముందు వరసలో ఉన్నారని, ఎమ్మెల్యేలను మార్చి, కొత్తవారికి టికెట్లు ఇచ్చిన వైసీపీ పరాజయం పాలుకాక తప్పదని సర్వే చెబుతున్న నిజాలు! ఇకపోతే మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సుమారు 10 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడక తప్పదని సర్వేలు ద్వారా తెలుస్తోంది! ప్రస్తుతం పల్నాడు ప్రాంతమంతా ప్రజలలో అధికారపార్టీపై వ్యతిరేక కొనసాగుతుండగా.. అధికార పార్టీ నాయకులు మూడు వర్గాలు చీలి అధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. పార్టీ నాయకులే రేపు నేతలను ఓడించే స్థాయికి సమాయక్తమవుతున్నట్లు తెలుస్తోంది! మరోవైపు పడకేసిన అభివృద్ధి, కుంటుపడ్డ వ్యవసాయం, జీవనోపాధులు వంటివి అధికార పార్టీ నేతల ఓటమికి అస్త్రాలుగా మారనున్నాయి! అలానే గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో తాడికొండ, తెనాలి, పొన్నూరు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలు వైసీపీ ఓటమిని చవిచూడబోతోంది! ఈ ఐదు నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల తీరును సొంతపార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొత్త అభ్యర్థులను తీసుకొచ్చినా.. గెలుపు అన్నది ప్రతికూలమే అని సర్వేలు వెల్లడిస్తున్నారు. పోతే బాపట్ల పార్లమెంట్ పరిధిలో బాపట్ల, వేమూరు, రేపల్లే నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీకి ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. ఇలా మొత్తంగా అధికార వైసీపీ గుంటూరు జిల్లాలో పట్టుకొల్పొయి, ప్రాభవం మసకబారుతోంది!
Must Read:- వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు