సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్పెయిన్ లో మహేష్ కు సర్జరీ జరిగిందని సమాచారం. దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇంతకీ ఏమైందంటే.. మహేష్ మోకాలి నొప్పితో గత కొంత కాలంగా బాధపడుతున్నారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో ఫిజియో థెరపీ చేయించుకున్నారట. ఏం ఫరవాలేదు తగ్గిపోతుంది అనుకున్నారు. అయితే.. సర్కారు వారి పాట షూటింగ్ సమయంలో చిన్న గాయం అవడంతో.. మోకాలి నొప్పి మరింత పెరిగింది.
ఇప్పుడు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సోమవారం స్పెయిన్ కు వెళ్లి సక్సెస్ ఫుల్ గా మోకాలికి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న మహేష్ బాబు ఈసారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దుబాయ్ లో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే మహేష్ సతీమణి నమ్రత మహేష్ వెంట ఉండగా.. డిసెంబర్ 24న పిల్లలు గౌతమ్, సితార దుబాయ్ కు వెళ్తారని సమాచారం.
మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరిగిందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Must Read ;- సమంతకు అస్వస్థత. ఇంతకీ ఏమైంది..?