నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఆరు నెలలగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో బాలయ్యను అక్టోబర్ 31న చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కేర్ హాస్పటల్ లో జాయిన్ చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్. ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలియచేశారు. అయితే.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని బాలయ్యకు డాక్టర్లు సూచించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటించారు. డిసెంబర్ 2న అఖండ విడుదలకు రెడీ అవుతంది.
త్వరలోనే అఖండ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. దీపావళి రోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతోంది. తర్వాత క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరో వైపు ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్స్ పేరుతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తూ టాక్ షో చేస్తున్నారు.
Must Read ;- బాలయ్య అఖండ రిలీజ్ డేట్ ఇదే











