తెలుగు తెరకు ప్రేమకథల తాకిడి ఎక్కువ. ప్రేమకి కాస్త ఘాటైన రొమాన్స్ జోడిస్తే .. థియేటర్లకు తాకిడి ఎక్కువ. అలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ శుక్రవారం ఒక సినిమా రానుంది .. దాని పేరే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఆలస్యం చేయకుండా దానిని వెంటనే చేసేయి అనే అర్థం కూడా టైటిల్లో ఉండటంతో ఈ సినిమా యూత్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో యుగంధర్ అనే దర్శకుడు పరిచయం కానున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో యుగంధర్ ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. ” నేను ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయింది. డైరెక్షన్ డిపార్టుమెంటులో చాలా కాలం పాటు పనిచేస్తూ వచ్చాను. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే కోరిక ఉంది. అయితే దానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఈ కథను సిద్ధం చేసుకున్నాను. ఏడాది క్రితమే ఈ కథను రెడీ చేసుకున్నప్పటికీ, కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.
ఈ సినిమాలో హీరోగా చేస్తున్న హస్వంత్ తెలుగు కుర్రాడే. ఇక హీరోయిన్ నమ్రత డెర్కర్ ముంబై అమ్మాయి. ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే సందేశం యూత్ కి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా చేసిన ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- అప్పుడు డైలాగ్స్ ఇప్పుడు డైరెక్షన్











