స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ లో స్పీడు పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకెళుతుంది. అయితే.. ఆదివారం కడప నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అనంతరం కడప పెద్ద దర్గా వద్ద సమంత ప్రత్యేక ప్రార్థనలు చేసింది. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే… ఏమైందో ఏమో కానీ.. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు.
తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో సామ్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి వెళ్లారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో సమంత ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు షికారు చేశాయి. దీంతో సమంత ఆరోగ్యం గురించి సినీ ప్రముఖులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఇలా సమంత ఆరోగ్యం గురించి వార్తలు రావడం.. ఫోన్ లు రావడంతో ఈ వార్తల పై సమంత మేనేజర్ మహేంద్ర వివరణ ఇచ్చారు.
సమంత పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని కొంచెం దగ్గు ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేశారని తెలిపారు. ప్రస్తుతం సామ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ వార్తలను నమ్మొద్దు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియచేశారు.