మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ ట్రైలర్ జనం ముందుకు రాబోతోంది. ఈ ట్రైలర్ విడుదల తేదీని దర్శకనిర్మాతలు ఖరారు చేశారు. డిసెంబరు 3న ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ రావడమే తరువాయి. ఎందుకంటే జనవరి 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11 వేల తెరలపై విడుదలవుతోంది. ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్ డేట్ ను వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో పాటు కొత్త పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు.
‘బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం ఎదురుచూడండి. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి’ అంటూ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ డిజైన్ లోనూ ప్రత్యేకత చూపించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్ గణ్ విషణ్ణ వదనాలతో ఉన్న ఫొటో ఇది. జనని పాటలో ఉన్న వీరి లుక్ తోనే ఈ పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ట్రైలర్ విడుదలైతే గానీ ఇందులోనే ఎమోషన్స్ అభిమానులకు అర్థంకాదు. దేశభక్తి పూరిత కథాంశంతో చిత్రం తెరకెక్కిందన్నది అర్థమవుతోంది.
Must Read ;- మహేషన్నతో తమ్ముడు ఎన్టీఆర్.. మధ్యలో పవర్ స్టార్
DECEMBER 3rd… RRR Trailer Day… #RRRTrailer #RRRTraileronDec3rd #RRRMovie pic.twitter.com/qAqk7Pi0Ra
— rajamouli ss (@ssrajamouli) November 29, 2021











