Interesting Updates About NTR Crazy Projects
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడో కూడా వచ్చింది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. డిసెంబర్ నుంచే ఈ సినిమాని ప్రారంభించాలి అనుకున్నారు. అయితే.. ఎన్టీఆర్ చేతికి గాయం కావడం.. సర్జరీ చేయించుకోవడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ క్రేజీ మూవీని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఓ భారీ సెట్ ను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే.
Interesting Updates About NTR Crazy Projects
ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రాన్ని 2022 అక్టోబర్ లో ప్రారంభించాలి అనుకుంటున్నారు. అయితే.. ఈ రెండు సినిమాల్లో కూడా తారక్ రెండు సాలిడ్ గెటప్స్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ గెటప్స్ ఉంటాయని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ సినిమాలో కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 2022లో ఈ రెండు సినిమాలకు ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సూపర్ లైనప్ తో దూసుకెళుతున్నాడు. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
Must Read ;- మహేష్, ఎన్టీఆర్ ల స్పెషల్ ఎపిసోడ్ వచ్చేస్తోంది











