Big Update Of JR NTR Movies
బుల్లి తెరపై హోస్ట్ గా బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇక పూర్తిస్థాయిలో నటనపై దృష్టిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో గడిపేందుకు విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి రాగానే ట్రిపుల్ ఆర్ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నారు. జనవరి 7న ఆ సినిమా విడుదల కాబోతోంది కాబట్టి అందులో పాలుపంచుకోక తప్పదు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. తన సినిమాల గురించి ఓ ప్రముఖ మీడియా పోర్టల్ తో ఎన్టీఆర్ మాట్లాడారు.
లైన్ లో మున్న తన మూడు సినిమాల గురించి గళం విప్పారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాల మేరకు దూసుకుపోతుందనే విషయం నాకు తెలుసు. రాజమౌళితో సినిమా నాకిది మొదటి సారి కాదు. ప్రేక్షకుల అంచాలకు మించేలా సినిమాని ఎలా తీయాలో అతనికి బాగా తెలుసు. అంతటి దూరదృష్టి అతనికి ఉంది. కచ్చితంగా ట్రిపుల్ ఆర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాకి సంబంధించి నాటు నాటు పాట షూటింగులో ఉండగా ఆ డ్యాన్స్ మూవ్ మెంట్ లను సరిగా చేయడానికి ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చింది.
Big Update Of JR NTR Movies
దాదాపు 15 నుంచి 18 టేకులు తీసుకున్నాము. ఎందుకంటే డ్యాన్స్ మూవ్ మెంట్ లో సింక్ విషయంలో రాజమౌళి చాలా ప్రత్యేకంగా ఉండేవారు. ఏమాత్రం రాజీపడేవారు కాదు. ఆ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా త్వరగా చూడాలన్న క్యూరియాసిటీ మీకన్నా నాకే ఎక్కువగా ఉంది’ అని వివరించారు. తన 30 వ చిత్రం కొరటాల దర్శకత్వంలో ఉంటుందని చెప్పారు. అది రివెంజ్ డ్రామా సబ్జెక్ట్ అని చెప్పారు.
ఇది కూడా పాన్ ఇండియా పరిధిలోనే ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. ఇక తన 31వ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని పరిధి కూడా కేజీఎఫ్ మాదిరిగానే పెద్దగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. ఆయన వెకేషన్ నుంచి రాగానే కొరటాల శివ సినిమా కోసం ఫిజికల్ ఫిట్నెస్ చేయనున్నారు.
Must Read ;- ఆర్ఆర్ఆర్.. పవర్ ఫుల్ డైలాగ్ ఇదే
https://www.youtube.com/watch?v=G6IO94iU8dM











