ప్రాంతాల మధ్య చిచ్చే .. ఈ బిగ్బాస్.. !
బిగ్బాస్ బ్యాన్ చేయాలి .. లేకుంటే ఆంధ్రా, తెలంగాణ అంటూ వేర్పాటు వాదాన్ని రెచ్చకొట్టిద్దని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. నిన్న యాంకర్ రవి ఎలిమినేషన్ అయిన తరువాత అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో యాంకర్ రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్. అటువంటి రవిని ఎలిమినేట్ చేయడం ఏమిటని, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటపెట్టాలని నిర్వాహకులను డిమాండ్ చేశారు. రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందని, అసలు బిగ్ బాస్ షోను అన్ని భాషల్లో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ ను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ ను చూడలేకపోతున్నారు. హిందూ దేవుళ్లను సైతం కించపరుస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. బిగ్ బాస్ షోలో జరుగుతున్న అకృత్యాలను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి, చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బిగ్బాస్ షోను విమర్శించేవారి లిస్ట్ రోజురోజుకు ఎక్కవవుతోంది. ఈ షోను బ్యాన్ చేయాలని రాజకీయనాయకులు, వామపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- మహేష్ తో పోటీకి సై విజయ్ అంటున్నాడా..?