ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కొత్త రికార్డులకు నాంది పలికింది. పాత రికార్డులను ఇది తుడిచిపెట్టేసింది. ఆహా సబ్ స్క్రైబర్లు మరింతగా పెరగడానికి ఇది దోహదపడింది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో హిట్ అని చెప్పలేం.. బ్లాక్ బస్టర్ హిట్ అని మాత్రం చెప్పవచ్చు. ఆహా ఓటీటీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమానలు చేపట్టారు. ఆ రికార్డులన్నీ బాలయ్య ధాటికి కొట్టుకుపోయాయి. ఈ షో ప్రారంభమయ్యాక ఈ ఓటీటీలో నాలుగు మిలియన్ల వీడియోలు ప్రదర్శితమయ్యాయంటే ఊహించుకోవచ్చు.
మొట్ట మొదటి ఎపిసోడ్ ని మంచు మోహన్ బాబుతో ప్రారంభించారు. పైగా ఇందులో ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని వచ్చారు. ఈ రెండు ఎపిసోడ్ లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నదేమిటంటే జనం కూడా ఇలా ముఖాముఖి చర్చలను ఇష్టపడుతున్నారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే ఇక అంతకంటే కావలసింది ఏముంటుంది. ఇందులో పాల్గొన్న గెస్ట్ లు మాట్లాడకూడని అంశం అంటూ ఏదీ లేదు.
నిర్మొహమాటంగా రాజీకీయాల గురించి మాట్లాడవచ్చు. సామాజిక అంశాలు, క్రికెట్, హాబీలు, సినిమాలు.. ఇలా దేనిగురించైనా చర్చించుకోవచ్చు. ఇలాంటి చర్చలను విని జనం కూడా ఆనందిస్తున్నారు. పైగా సెలబ్రిటీలతో ఇలాంటి షో అంటే ఇక కావలసింది ఏముంటుంది. ఈ ప్రోగ్రామ్ కు స్పాన్సరర్లయిన మాన్షన్ హౌస్, స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, నంద్ గోకుల్ నెయ్యి లాంటి సంస్థలు కూడా ఎంతో సంతృప్తి చెందాయి. వారు ఊహించినదానికన్నా ఎక్కువ విజయం లభించడమే అందుకు కారణం.
బాలయ్య చేతికి గాయం కావడంతో ఈ షోకి మధ్యలో కొంత అంతరాయం ఏర్పడింది.అంత మాత్రాన ఇది స్టాపబుల్ షో కాదు.. కచ్చితంగా అన్ స్టాపబుల్ షోనే. బాలయ్యను ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే తదుపరి ఎపిసోడ్ కూడా సిద్హమైనట్టు సమాచారం. ఈసారి ఎవరో కాదు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. సినిమాల్లో కాస్త విశ్రాంతి తీసుకున్న బ్రహ్మానందం మళ్లీ కొత్త ఉత్సాహంతో కదనరంగంలోకి దూకేందుకు ఉత్సాహపడుతున్నారు. దానికి ఈ షో కూడా కొంత హెల్ప్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇంకా ఎలాంటి రికార్డులను ఈ షో సృష్టిస్తుందో చూడాలి.
Must Read ;- బాలయ్య ‘అఖండ’కు పాజిటివ్ టాక్











