లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే చందమామలా ఉందనిపించుకుంది కాజల్ అగర్వాల్. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ సరసన మగధీర, అల్లు అర్జున్ సరసన ఆర్య 2, ప్రభాస్ సరసన డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, ఎన్టీఆర్ సరసన బృందావనం తదితర చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా సుస్థిర స్ధానం సంపాదించుకుంది.

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించిన కాజల్ ఇటీవల తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తుందా.? లేదా అనుకుంటే.. పెళ్లైన కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో జాయిన్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. చిరు, కాజల్ పై కీలక సన్నివేశాలను ఆమధ్య చిత్రీకరించారు. ఈ భారీ చిత్రం ఆచార్య మే 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్.. పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తన పేరుని మార్చుకుంది. అవును.. నిజంగానే కాజల్ తన పేరును మార్చుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రొఫైల్‌లో భర్త పేరు కలిసి వచ్చేలా తన పేరుని కాజల్ ఎ కిచ్లు అని మార్చుకుంది. తాజాగా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి కాజల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ నటించనున్న మరికొన్ని సినిమాలు డిష్కసన్స్ స్టేజ్ లో ఉన్నాయని సమాచారం.
Also Read: కాజల్ కళ్యాణ వైభోగమే











