రాష్ట్రమంతా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పట్ల భగ్గుమంటున్నారు. పార్టీ నేతల నుంచి.. ఉద్యోగ సంఘాల వరకు అందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సముఖంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
ఉద్యోగ సమస్యలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. దాదాపు 18 వేల మంది ఉద్యోగులు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారని.. దాదాపు మొత్తంగా 70-80 వేల మంది విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రత్యక్షంగా ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. వీళ్లు కాకుండా పరోక్షంగా దాదాపు 3 లక్షల మంది ఆధారపడ్డారు. ఈ కర్మాగారానికి అనుసంధానంగా ఆ ప్రాంతంలో ఎన్నో కంపెనీలు ఆధారపడ్డాయి. ప్రైవేట్ వారి చేతికి పోగానే.. వారు భారం తగ్గించుకునే ప్రయత్నంలో ముందుగా ఉద్యోగులకే ఎసరు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్థానికులకు అవకాశాలు దక్కకుండా పోతాయి. వారు ఎవరిని కావాలంటే వారిని తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న స్టీల్ ప్లాంట్ రూపురేఖలు మారిపోతాయి. ఇకపై స్టీల్ ప్లాంట్‌ని ఈ విధంగా చూడలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి త్యాగాలతో ముడిపడున్న స్టీల్ ప్లాంట్‌ని ఇలా అమాంతం ప్రైవేటీకరణ చేయడం న్యాయం కాదు. దీని వల్ల నష్టాలే తప్ప, ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉండవు. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీళ్లేదు.. ఎలాగైనా ఆపి తీరాలంటూ ఉండవల్లి పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు నష్టాలొస్తున్నాయో అందరికీ తెలుసు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటూ ప్రత్యేకించి ముడి ఇనుము గనులు లేకపోవడం వల్ల.. కర్మాగారం నష్టాలపాలవుతుందని తెలిసీ కూడా.. ఆ దిశగా సమస్య పరిష్కారం చేయకుండా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం సమస్యకు పరిష్కారం కాదంటూ కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడ్డారు ఉండవల్లి. విశాఖపట్టణానికి చాలా పురాణమైన చరిత్ర ఉందని.. ఎందరికే అవకాశాల స్వర్గధామంగా కొన్ని దశాబ్దాలుగా విరాజిల్లుతున్న నగరమని ఉండవల్లి వైజాగ్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు.
Also Read: ఉండవల్లి మాట : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం











