ఆచార్య సినిమా సెట్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆ లొకేషన్‌కు మంత్రి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి కొంతసేపు మాట్లాడారు. అక్కడే ఉన్న దర్శకుడు కొరటాల శివతో సరదాగా ముచ్చటించారు. చిత్ర బృందానికి, మెగాస్టార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ… మంత్రి ట్వీట్ చేశారు.
యాధృచ్ఛికమా.. లేక రాజకీయమా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి మంత్రి అజయ్ కుమార్ సన్నిహితులు! మంత్రి కేటీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో బహిరంగంగానే అజయ్ నా చిన్నకొడుకు అని చెబుతుంటారు. ఈ క్రమంలో చిరుని అజయ్ కలవడం యాధృచ్ఛికమేనా.. లేక ఇందులో ఏమైనా రాజకీయం దాగుందా అనే చర్చ జరుగుతోంది!

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘ఆచార్య’. కాజల్ కథానాయిక. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే నటించనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Must Read ;- ‘ఆచార్య’ టీజర్ ను 29నే రిలీజ్ చేయడం వెనకున్న సీక్రెట్ ఇదే
ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. Megastar @KChiruTweets గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ. ఎం pic.twitter.com/INwVEVjduo
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 30, 2021










