మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ముందుగా కథానాయికగా త్రిషనే అనుకున్నారు. త్రిష కూడా ఆచార్యలో నటించేందుకు ఓకే చెప్పింది. చిరు, త్రిష కాంబినేషన్ లో సీన్స్ ను త్వరలోనే షూట్ చేస్తారనుకుంటే… చిరంజీవి సినిమాలో నటించడం లేదు అని త్రిష సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. త్రిష తప్పుకోవడంతో కాజల్ ని ఫిక్స్ చేశారు.

అయితే.. త్రిష తప్పుకోవడం వివాదస్పదం అయ్యింది. కారణం ఏంటంటే.. తన పాత్ర నిడివి కథ చెప్పినప్పుడు ఒకలా ఉంది ఆతర్వాత పాత్ర నిడివి చాలా వరకు తగ్గించేసారు. ఇలా క్రియేటీవ్ డిఫరెన్సస్ రావడం వలనే త్రిష ఆచార్య నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక చిరంజీవి త్రిష తప్పుకోవడం గురించి వివరణ ఇస్తూ.. త్రిష మణిరత్నం సినిమాలో నటిస్తుంది. అందుచేత డేట్స్ ప్రాబ్లమ్ వలన ఆచార్య మూవీ నుంచి తప్పుకుందన్నారు. అయితే.. త్రిష ఆచార్య మూవీ నుంచి తప్పుకోవడం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పుడు చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఈ మూవీలో చిరు సరసన నటించేందుకు త్రిషను కాంటాక్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చిరు, త్రిష కలిసి గతంలో స్టాలిన్ సినిమాలో నటించారు. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మరి.. ఈసారైనా త్రిష చిరు మూవీలో నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.











