డైరెక్టర్ తేజ ‘అలివేలు వెంకటరమణ’ అనే సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో హీరో గోపీచంద్ కాగా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని ఫిక్స్ అయ్యారు. ఇదంతా కరోనాకు ముందు మాట. కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కాజల్ అగర్వాల్ కి పెళ్లి అయ్యింది. ఇప్పుడున్న హీరోలు అందరూ రెండు మూడు సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ‘అలివేలు వెంకటరమణ’ ప్రాజెక్ట్ నుంచి గోపీచంద్, కాజల్ తప్పుకున్నట్టు సమాచారం.
గోపీచంద్ తప్పుకోవడంతో తేజ మరో హీరో కోసం వెతుకుతున్నారట. అయితే.. తెలుగులో హీరోలెవరు ఖాళీగా లేరు. అందుచేత తమిళ్ హీరోను రంగంలోకి దింపాలని చూస్తున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంతో తేజ తాప్సిని కాంటాక్ట్ చేశారట. తేజ చెప్పిన కథ విని తాప్సి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఆమెకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమా పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట.
ప్రస్తుతం తేజ హీరోని వెతికే పనిలో ఉన్నారట. హీరో దొరికితే.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. అయితే.. తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆతర్వాత తీసిన సీత సినిమాతో మళ్లీ ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు సక్సస్ సాధించాలని పట్టుదలతో తేజ.. అలివేలు వెంకటరమణ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో మళ్లీ సక్సస్ ట్రాక్ లో వస్తారేమో చూడాలి.