వ్యాక్సిన్ లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి అన్నింటికి చెక్ పట్టేలా మరో కొత్త టీకా రానుంది. అదే స్పుత్నిక్-వి. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం భారత్ మార్కెట్‌లోని రానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రకటించింది. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ రష్యాకు టీకాకు భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ పాట్నర్‌గా ఉంది. ఇదిలా ఉంటే డాక్టర్ రెడ్డీస్ తాజాగా స్పుత్నిక్ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్ ధరను ప్రకటించింది. ఒక్కో డోసుకు రూ. 995.40గా నిర్ణయించింది. ఇందులో 948 రూపాయలు టీకా ధర కాగా, 5 శాతం జీఎస్టీగా నిర్ణయించారు. ఇతర దేశాల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు.
ప్రకాశంపై బోటు బాంబు నిజమే..!! ఆ నీచుడు దొరికాడు..!!
విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర...