పాపం పండితే .. ఎంతటివారికైనా పతనం కాకతప్పదు!
ఈశ్వరుడు నోరిచ్చాడని ఇష్టమొచ్చినట్లు వాడితే .. ఏదో ఒకరోజు పాపం పండుతోంది. న్యాయం, ధర్మం, కాలం, ప్రకృతి కన్నెర్ర చేస్తే .. ఎంతటివారైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. ఇదే పాకీ(పంచ్) ప్రభాకర్ విషయంలో నిజమైంది. ‘పంచ్ ప్రభాకర్’ అనే యూట్యూబ్ చానెల్ పెట్టి .. వాడి పైత్యాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేస్తుంటాడు. అధికారపార్టీ కి చెందిన ఈ నాయకుడు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు. అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్. వెటర్నరీ డాక్టర్ గా అమెరికాలోని న్యూజెర్సీలో ఉద్యోగం వెలగబెడుతూ .. అప్పుడప్పుడు తన బూతులను దండకాన్నే ప్రవృత్తిగా పెట్టుకుని తన యూట్యూబ్ లో అకృత్యాలను వెల్లగక్కుతుంటాడు. ప్రభాకర్ రెడ్డి పాకీ మాటలకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లతో పాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వంటి రాజ్యాంగబద్ధ పదవీల్లో కొనసాగుతున్న వ్యక్తులు కూడా బాధించపడ్డారు. ఇలా పాకీ ప్రభాకర్ నీచపు పంచ్ లను ఓ స్థాయిలో పేల్చుతున్నా .. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ, ఆ పార్టీ మంత్రులు ఖండించకపోవడం కడు శోచనీయం. గతంలో ఢిల్లీ పోలీసులు ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలానే ఏపి హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులపై తరుచు దూషణలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ప్రభాకర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశింది. మీకు చేతకాకపోతే చెప్పండి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఏర్పాటు చేసి ఎలా అరెస్ట్ చేసి తీసుకురావాలో మాకు తెలుసునని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె. లలితతో కూడిన ధర్మాసనం సీబీఐని హెచ్చరించింది.
దూకుడు పెంచిన సీబీఐ!
అరచేతిలో భవిష్యత్తు కనిపించడంతో కేసును సీబీఐ సీరియస్ గా తీసుకుంది. తనదైన దూకుడుతో న్యాయమూర్తులను దూషించే దౌర్భాగ్యున్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్థం చేసింది. పాకీ ప్రభాకర్ పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. దీంతో అతి త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యాలు చేసిన మరో ఐదుగురిపై కూడా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పాకీ ప్రభాకర్ తోపాటు మరో 11 మంది నిందులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన డెడ్ లైన్ కు ముందే సీబీఐ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పురోగతి, భవిష్యత్ లో తీసుకోబోయే చర్యలపై వంటివి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈ నెల 22 వాయిదా లోపే ప్రభాకర్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలపెట్టేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.











