1970 లో విడుదలయిన సూపర్‌హిట్ మూవీ ‘మేరా నామ్ జోకర్’ గురించి తెలియని వారుండరు. అలాంటి లెజెండరీ క్లాసిక్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు సూర్యగోపాల్. 4am మూవీ మేకర్స్ బ్యానర్ లో సూర్యగోపాల్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాతలు శివ ఎన్, ఎస్.జి.కృష్ణ, నవీన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్బంగా డైరక్టర్ మారుతి ఈ చిత్రం పూజాకార్యక్రమం లో పాల్గొన్నారు. మారుతి ఈ సినిమా మెదటి షాట్ దేవుడు పటాలపై క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అలాగే గోపాల్ కి స్క్రిప్ట్ అందించారు. సినిమా నవంబర్ లో సెట్స్ మీదకి వెళ్ళనుంది.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. నా స్నేహితుడు సూర్య గోపాల్ కి సినిమా అంటే చాలా ఇష్టం. ‘మేరా నామ్ జోకర్’ అనే టైటిలంటేనే సూపర్‌హిట్. అలాంటిది చాలా సంవత్సరాల తరువాత ఈ టైటిల్‌తో మళ్ళీ సినిమా రావటం చాలా ఆనందంగా వుంది. మా గోపాల్ కి మంచి హిట్ రావాలని కొరుకుంటున్నాను అని అన్నారు. దర్శకుడు సూర్య గోపాల్ మాట్లాడుతూ.. మా సినిమా ప్రారంభానికి వచ్చిన మీడియా సోదరులందరికి థ్యాంక్స్, నేను మా మిత్రులు కలిసి 4am మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-1 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా దర్శకుడు మారుతి ‘మేరా నామ్ జోకర్’ టైటిల్ ఎనౌన్స్ చేయటం మా అదృష్ణం గా భావిస్తున్నాము. ఈ చిత్రం లో పాన్ ఇండియా ఆర్టిస్ట్ లు చేయనున్నారు. త్వరలో వివరాలు తెలియజేస్తాము. అని అన్నారు
రచయిత రాజు బోనాల మాట్లాడూతూ.. మా దర్శకుడు గోపాల్ గారు ప్రతి రోజు ఉదయమే 4 గంటలకి లేచి పనిచేసుకుంటారు. అందుకేనేమో బ్యానర్ నేమ్ 4am అని పెట్టారు. ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా వుంటుంది. చాలా కొత్త సబ్జక్ట్ దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి చేశాము. 24 క్రాఫ్ట్ పై కమాండ్ వున్న దర్శకుడు గోపాల్ గారు, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందం గా వుంది అని అన్నారు.











