టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. నారా లోకేష్ ఏపీలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ తుఫాను బాధిత రైతులను , ప్రజలను పరామర్శిస్తూ ఓదార్చుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జల్లాలో పర్యటించారు. బాధితులను పరామర్శిస్తూ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద స్వయంగా ఆయన ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. దీంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...