జలుబు చేసినా.. తలనొప్పి బాధించినా.. మన పెద్దలు వంటిల్లులోనే చక్కని పరిష్కారాలు కనిపెట్టేవాళ్లు. పసుపు, మెంతులు, అల్లం లాంటి దినుసులతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేవాళ్లు. కేవలం ఇంటి కిచెన్ ఉండే దినుసుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా…?
- ఏ ఇంట్లోనైనా కచ్చితంగా పసుపు ఉంటుంది. పసుపుకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగ పడుతుదంది. శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, కఫం, వాత, పిత్తం రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉంది. పసుపులో అలోవెరా గుజ్జుని కలుపుకుని ముఖానికి రాస్తే ముఖారవిందం పెరుగుతుంది. పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుసుకుని సేవిస్తే జలుబు, పొడ దగ్గు లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది.
- ఇంట్లో దొరికే జీలకర్రలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం. ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం, ఆజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ జీలకర్రని నిమ్మరసంతో కలిపి సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో తింటే.. తలతిరుగుడు, కడుపులోని వేడి మొదలగు పైత్యరోగాలు తగ్గుతాయి. ఆవాలు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మల బద్ధకం పోతుంది. అంతేకాదు.. తలనొప్పిని సైతం తగ్గిస్తాయట.
- కిచెన్ లో దొరికే మెంతులు సైతం ఆరోగ్యాన్నిస్తాయట. పరిగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మెకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును మెంతులు కరగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ధనియాలు జీర్ణక్రియ సమస్యలకు ఒక చికిత్సగా ఉంటాయి. ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్రac వస్తుంది.
- Must Read ;- మట్టినీరే.. మహాఔషధం!











