రోజు రోజుకూ ఎండలు మండుతున్నాయి. దప్పిక తీర్చుకునేందుకు జనం మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. మట్టి కుండలు దాహం తీర్చడమే కాకుండా… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయట. అందుకే చాలామంది మట్టి కుండలోని నీళ్లను తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో ఫ్రిజ్ లు ఉన్నా సరే.. మట్టి కుండకే జై కొడుతున్నారు. మట్టికుండలోని నీళ్లు తాగితే ఏయే ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి మరి.
వందశాతం ప్యూరిఫైడ్
కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్ చేసిన నీటితో సమామని నిపుణులు స్వయంగా రిసెర్చ్ చేసి మరి చెప్పారు. ప్యూరిఫైడ్ నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరవుతాయి. నీటిలోని మళినాలు కుండ పీల్చుకొని, ప్యూర్ వాటర్ గా మారుస్తుంది. మట్టి కుండలో అంతటి మహిమ ఉంది కాబట్టే మన పెద్దోళ్లు మట్టి కుండల్లో నీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేసేవాళ్లు.
Must Read ;- బీట్ ది హీట్ : సమ్మర్ కేర్ ఇలా..
ఇమ్యూనిటీ గుణం
మంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలో సహాజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు, ఇమ్యూనిటీ గుణాలను అధికంగా పెంచుతుంది. జలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వాళ్లు కుండ నీళ్లు తాగడం వల్ల, ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా వేసవిలో వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు. కుండలోని నీటితో ముఖం కడిగితే ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మెటబాలిజం రేటునూ పెంచుతుంది.
నో కెమికల్స్
ఈ రోజుల్లో చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారు. నిత్యం బాటిళ్లలో నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అందుకే మట్టి కుండలోని నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. కుండలోని వాటర్ ప్యూరిఫై అవ్వడం మాత్రమే కాకుండా, శరీరానికి ఎలాంటి హాని చేయదట.
Also Read ;- మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు
పేదొడి ఫ్రిజ్ గా పేరు
చాలామంది వేలకు వేలు పెట్టి ఫ్రిజ్ లు కొనలేరు. అందుకే పేదవాళ్లు మట్టి కుండలోని నీళ్లు తాగడానికి ఇష్టం చూపుతారు. పేదలు ఫ్రిజ్ కు బదులు మట్టి కుండలు కొంటున్నారు. వేసవి మొదలైందంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి నగారాల్లో రహదారులప పక్కన కుండలు దర్శనమిస్తుంటాయి. రూ.200 నుంచి రూ.400 వరకు మార్కెట్లో కుండలు దొరుకుతున్నాయి.
Also Read ;- ఆయన కనీసం 180 ఏళ్లు జీవిస్తాడట!
మట్టిపాత్రల్లో వంట
మట్టి పాత్రలు, మట్టి కుండలలో వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. టీ కప్పు నుంచి వాటర్ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటుల ఉంటున్నాయి. మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్‌లలో ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు.











