గాడ్ ఫాదర్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమా సెట్ లోకి మెగాస్టార్ కాలు పెట్టేశారు. మలయయాళ హిట్ సినిమా ‘లూసీఫర్’ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్టు దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మెగా అభిమానులకు ఇది శుభవార్తే. ‘ఆచార్య’ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ పూర్తిస్థాయి దృష్టిని ఈ సినిమా మీద పెట్టేశారు. హైదరాబాద్‌లో ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో ఓ భారీ సెట్ వేశారు.
కొన్ని సన్నివేశాలను ఇందులో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ అంతా ఇందులోనే చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఇది 153వ సినిమా. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల ఓ పాట రికార్డింగ్ ను కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తో ఆ అనుభూతిని కూడా పంచుకున్నారు. తాను మెగాస్టార్ అభిమానినని, ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని తమన్ పేర్కొన్నారు.
ఇందులో నయనతారను హీరోయిన్ గా మొదట అనుకున్నారు. ప్రస్తుతం లూసీఫర్ లో నటించిన మంజు వారియర్ నే తీసుకోవాలని ఆమెతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకకు సంబంధించి చాలా సర్ ప్రైజింగ్ అంశాలు ఉన్నాయి. వాటిని మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవలే ‘ఆచర్య’ షూటింగ్ ను పూర్తిచేసుకున్న మెగాస్టార్ వైజాగ్ వెళ్లొచ్చి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. గాడ్ ఫాదర్ పేరుతోనే అందరూ ఈ సినిమాని వ్యవహరిస్తున్నారు. ఇది పరిశీలనలో ఉన్న టైటిల్ మాత్రమే. అధికారికంగా పుట్టినరోజు నాడు ప్రకటించే అవకాశం ఉంది.











