సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేసిన సినిమా అఖండ. దీంతో అఖండ సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే.. ఆ అంచనాలకు మించి అఖండ అద్భుతమైన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం అఖండ రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. దీంతో బోయపాటికి మెగాస్టార్ ఫోన్ చేసి అభినిందించార.
అంతే కాకుండా.. మంచి కథతో వస్తే.. సినిమా చేద్దామని ఆఫర్ కూడా ఇచ్చారట. చిరు, బోయపాటి కాంబినేషన్లో మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని సరైనోడు సినిమా టైమ్ లో వార్తలు వచ్చాయి. అయితే.. ఆతర్వాత బోయపాటి రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేయడం.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చిరుతో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఇప్పుడు అఖండ అద్భుతమైన విజయం సాధించడంతో చిరు నుంచి బోయపాటికి ఆఫర్ వచ్చింది. అఖండ తర్వాత బోయపాటి బన్నీతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్.. బన్నీ, బోయపాటి కాంబినేషన్లో మూవీని ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. బోయపాటి కనుక కథతో చిరును మెప్పిస్తే.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం ఖాయం. అదే కనుక జరిగితే మెగా అభిమానులకు పండగే.
Must Read ;- టాక్ అఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ‘అఖండ’











