నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే అఖండమైన విజయంతో దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన భారీ చిత్రం కావడంతో ఎలాంటి స్పందన వస్తుందో అనుకున్నారు. అయితే.. అంచనాలకు మించిన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది.
ఇంతకీ అఖండ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే… నైజాం – 4.39కోట్లు, సీడెడ్ – 4.02 కోట్లు, యు.ఎ 1.36 కోట్లు, ఈస్ట్ – 1.05కోట్లు, వెస్ట్ – 96 లక్షలు, గుంటూరు – 1.87 కోట్లు, కృష్ణ – 81 లక్షలు, నెల్లూరు – 93 లక్షలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 15.39కోట్లు షేర్ 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షో అండ్ ఫస్డ్ డే కలెక్షన్స్ తో హాఫ్ మిలియన్ క్రాస్ చేసిందని సమాచారం. సెకండ్ వేవ్ తర్వాత హయ్యస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసిన తెలుగు సినిమాగా అఖండ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఇక రెండో రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదే స్పీడు కంటిన్యూ అయితే.. అఖండ బాక్సాఫీస్ దగ్గర న్యూ రికార్డ్ సెట్ చేయడం ఖాయం అని చెప్పచ్చు.
Must Read ;- టాక్ అఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ‘అఖండ’











