గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తోందని.. ఈ మూవీ టైటిల్ పక్కా కమర్షియల్ అని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి పక్కా కమర్షియల్ మూవీ ఎలా ఉంటుంది.? గోపీచంద్ ని మారుతి ఎలా చూపించనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లు పై ఈ చిత్రం రూపొందుతోంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా పక్కా కమర్షియల్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘ఎవరికి చూపిస్తున్నారు సార్.. మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి.. చూసి వచ్చేశా..’ అని గోపీచంద్ చెప్పడంతో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది. సీరియస్ యాక్షన్ కి మారుతి స్టైల్ కామెడీ మిక్స్ చేసి ఈ పక్కా కమర్షియల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు అనిపిస్తోంది. ఈ టీజర్ చివరిలో.. ఎక్స్ ప్రెషన్ ఎలా పెట్టాలో.. రాశీ ఖన్నా ఎక్స్ ప్రెషన్ తో చెప్పడం బాగుంది.
కమర్షియల్ సినిమాకి ఏం కావాలో.. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని మారుతి టీజర్ తో హింట్ ఇచ్చేశాడు. మొత్తానికి పక్కా కమర్షియల్ టైటిల్ కి తగ్గట్టే పక్కా కమర్షియల్ గా ఉంది. సరికొత్త అవతారంలో కనిపిస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తాడనిపిస్తోంది. ఈ టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. పక్కా కమర్షియల్ అనే అనిపిస్తోంది. కాకపోతే ఇటీవలే విడుదలైన మంచి రోజులు వచ్చాయి మాత్రం మారుతిని నిరుత్సాహానికి గురిచేసింది. ఆ ప్రభావం సినిమా మీద పడకుండా ఉండాలని ఆయన జాగ్రత్త పడుతున్నారు. మంచి రోజులు వచ్చాయి చిత్రాన్ని జనంలోకి తీసుకువెళ్లడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.
Must Read ;- పుష్ప న్యూ టీజర్ ఎలా ఉండబోతుందో తెలుసా?











