అద్దె వ్యూహాలతో అడ్డంగా బుక్కైన జగన్ రెడ్డి .. !
2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలుపుకు అన్ని పాచికలను వేసి.. ప్రశాంత్ ఒకసారికి మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఈసారి ఏపీలో ఆయన పాచికలు పారావ్! ఎందుకంటే పీకే సలహాలు, తద్వారా జగన్ రెడ్డి అమలు చేసే అద్దె వ్యూహాలు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి. జగన్ ఏపీలో బయట కాలు పెట్టాలన్నా .. కేబినెట్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా .. అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా.. పీకే స్ట్రాటజీ అప్లై కావాల్సింది. పర్యావసానంగా ఏపీలో జగన్ రెడ్డిని అనాలోచిత నిర్ణయాలకు జరిగిన విధ్వంసకర పరిస్థితులు ప్రజలకు పూర్తిగా అవగతమౌతునే ఉన్నాయి. అర్థికంగా, సామాజీకంగా, రాజకీయంగా ఏపీ 40 ఏళ్లు పాటు కొలుకులేని దెబ్బ పడడానికి ప్రధాన కారణంగా పీకే అండ్ కో అన్నది అక్షర సత్యం.
ధ్వంస రాజకీయాలతో ఏపీకి చేటుకాలం దాపురించింది!
జగన్ రెడ్డి ఏపీ పాలన పగ్గాలు చేపట్టిన తొలినాళ్ల నుంచే కూల్చుడు రాజకీయాలతో ముందుకు సాగాడు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన జగన్ రాజకీయాలు .. నేటి టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి వరకు చేసిన నీచ రాజకీయాలు ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేదు. అటువంటి నీచ రాజకీయాలకు సలహాదారుడు మహానుభావుడు ఈ ప్రశాంతే అన్నది జగమెరిగిందే. ప్రతిపక్షంపై చేసే దాడులు, వ్యక్తి దూషణలు, వ్యక్తిత్వ హననాలు ఒకెత్తైతే .. విగ్రహాలు, రథాలు, ఆలయాల ధ్వంసం మరోక అరాచకం. కులాలు, మతాలు మధ్య పెట్టే చిచ్చులు ప్రమాదకర రాజకీయాలయినప్పటికీ .. వాటితో కూడా చలికాసుకున్నారు జగన్ రెడ్డి అండ్ పీకే. ఇవన్నీ జగన్ రెడ్డి వైఫల్యాను కప్పిపుచ్చడాకే ఎత్తులు. వైఫల్యాలను, ఆర్థిక విధ్వంసం, అవినీతి, దుందుడుకు చర్యలను కప్పిపుచ్చుకోవాడాని ప్రశ్నించిన ప్రతిపక్షంపై దాడులకు తెగపడుతూ .. టాపిక్ డైవర్ట్ రాజకీయాలు చేయడం పీకేకి వెన్నతోపెట్టిన విద్య. ఇటువంటి దౌర్భగ్య దాడులకు పీకే ఆదేశిస్తాడు .. జగన్ ఆచరిస్తాడు. తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ప్రజలు బలైపోతున్నారు.
జగన్ యాక్షన్ కు.. డైరెక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ కూడా ప్రశాంతే ..!
విగ్రహాలు విధ్వంసకర రాజకీయాలు రాజ్యమేలుతున్నప్పుడు జగన్ రెడ్డి స్వామిజీల వద్దకు పోతాడు .. బుద్థిమంతుడిలా పంచకట్టి, రాష్ట్ర ప్రజలు చూసేలా షో పుట్ ఆప్ రాజకీయాలకు తెరతీస్తారు. గోపూజలు చేస్తూ రాజకీయ నాటనను రక్తి కట్తిసాడు. దేవాలయాలకు వెళ్లి అపర భక్తుడులా ఫోటోలకు, విజువల్స్ కు ఫోజులిస్తాడు. ఇలా టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెరతీయడమే తప్పా.. హిందూ మతం, వాటి విలువలు, హిందుత్వంలో పాటించాల్సిన ఆచారాలు జగన్ కు మచ్చకైనా తెలియవు. వీటిన్నీంటికీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్ మొత్తం పీకే నే. ఇవన్నీ ప్రజలకు అర్థంకావులే అని పిల్లి పాలు తాగే చందాన్ని అనుకరిస్తారు ఈ ఇరువురు. కానీ ఏపీలో జరిగే రాజకీయాలను దేశ మొత్తం ఎంతో నిశితంగా పరిశీలిస్తోంది. చైతన్యవంత రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఏపీలో జగన్ కుయుక్తులు, ప్రశాంత్ కిషోర్ నీచ ఆలోచనలు ప్రజలకు అర్థకావు అనుకోవడం ఒట్టి భ్రమే!
పీకే పవర్ పాలిటిక్స్ ఇక వర్కౌంట్ కాదు .. జగన్ పాలన అట్టర్ ప్లాఫ్ !
పీకే పవర్ పాలిటిక్స్ ఏపీలో ఇక వర్కౌంట్ కావు. ఎందుకంటే జగన్ రెడ్డి పాలనలో విధ్వంసాలకు కేంద్ర బిందువు పీకే మస్తీష్కమే అన్నది ప్రజలకు క్లియర్. ప్రస్తుతం ఏపీలో జగన్ రెడ్డి పాలన, జరుగుతున్న ఆర్థిక విధ్వంసం, కుంటుపడుతున్న ఉపాధి, మెరుగుపడని ఆదాయ వనరులు యావత్తు చూస్తే సర్వతో సర్వనాశనం అన్న విధంగా మారడానికి కారణం ప్రశాంత్ కిషోర్ ను గుడ్డిగా జగన్ ఫాలో కావడమే. పీకే ఎటు వైపుంటే అటువైపు విజయం ఖాయమని అందరూ అనుకుంటారు .. కాదు అది పొరపాటు. ఎవరైతే గెలుస్తారో అని సర్వేలు చేబుతాయో వారివైపు పక్షంలో చేరి .. తన పొలిటికల్ స్ట్రాటజీ జోడిస్తాడు పీకే .. అంతే తప్పా .. ఒక కిందిస్థాయి వ్యక్తిని తన యుక్తితో స్వతహాగా ముఖ్యమంత్రిని చేసిన దాఖాలు లేవు అన్నది కూడా చరిత్ర చెబుతున్న నిజాలే. స్టాలీన్, జగన్ లకు ఒక్క అవకాశమిద్దామన్న ఆలోచనే వారిని ముఖ్యమంత్రులను చేసింది. దీదీ కూడా తనకున్న చరిష్మా కారణంగా ఒంటిచేత్తో పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలకు తెలియనివి కావు. వీరి విజయంలో పీకే పాత్ర చాలా తక్కువ. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుకుని ప్రజలను, పాలనను గాలికొదిలేస్తే.. జగన్ రెడ్డి మంచి నాయకుడుగా ఎలా మనగల్గుతాడు? జగన్ మాయ మాటలు, మోసపూరిత హామీలు ఇంకా జనం నమ్మె పరిస్థితుల్లో నేడు ఉన్నారా? అంటే లేరు, ఆయన అసలుసిసలైనా నాయకుడే కాదు అన్న సమాధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తుంటాయి. కనీసం రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడైనా.. ప్యాలెస్ బౌండరీ దాటి బయటకురాడు జగన్. సొంత జిల్లా కడప వరద కొట్టుకుపోతుంటే సరైన సమయంలో కనీసం మోహం కూడా చూపించలేని పరిస్థితి తనది. చివరికి పీకే అద్దె సలహాలతో కాలు బయటపెట్టి అరపూట కడప, మరో పూట చిత్తూరు, నెల్లూరు అలా తిరిగి… ప్యాలెస్ కు చేరాడు. ఇటువంటి నాయకున్ని నమ్మి ఓట్లు వేసిన పాపానికి రాష్ట్రం తీవ్ర శాపానికి గురైంది అన్నది వాస్తవం. దీనికి కారణం.. కనిపించే అరాచక శక్తి జగన్ రెడ్డి అయితే .. కనబడి ఉన్మాద రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ అన్నది ప్రజలకు ఎప్పుడో క్లియర్ కట్ గా అర్థమైంది.
Must Read ;- మద్యం సీసాలో పురుగులు.. అత్యంత ప్రమాదకరం ఏపీ మద్యం..!











