నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బిబీ 3 గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాని యన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 28న విడుదల చేయబోతున్నారు. అయినప్పటికీ ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఫైనలైజ్ చేయలేదు. ఇక ఇందులో బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారని అందులో ఒకటి ఐ.ఏ.యస్ అయితే.. మరొకటి అఘోరా అంటూ ప్రచారం జరిగింది.
అందులో అఘోరా పాత్రను డిలీటీ చేశారనే వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. దాని స్థానంలో అప్పటికప్పుడు మరో కొత్త పాత్రను బోయపాటి డిజైన్ చేశాడట. ఇప్పుడు కొత్తగా వినిపిస్తోన్న అప్టేట్ ఏంటంటే.. బోయపాటి కొత్త గా డిజైన్ చేసిన పాత్ర కోసం బాలయ్య తెరమీద తొలిసారిగా విగ్గు లేకుండా నటిస్తున్నారట. రామ్ గోపాల్ వర్మ రౌడీ సినిమా కోసం మోహన్ బాబు ఇలాగే విగ్గులేకుండా తొలిసారిగా తెరమీద కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీబీ 3 లో బోయపాటి.. బాలయ్య పాత్రను చాలా సహజం గా డిజైన్ చేశాడట. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే.. మే 28 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- బాలయ్య బోయపాటి సినిమా టైటిల్ రివీల్ అయ్యేది అప్పుడేనట.. !