టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో బాలయ్య , బోయపాటి సినిమా ఒకటి. గతంలో ఈ ఇద్దరి కాంబో లో వచ్చిన సింహా, లెజెండ్ మూవీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. బోయపాటి ఈ మూవీలో బాలయ్యను రెండు పవర్ ఫుల్ పాత్రల్లో ఎలివేట్ చేస్తున్నాడు. అందులో ఒకటి అఘోరా అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మే 28న సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ.. ఇంకా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయకపోవడం అభిమానుల్ని నిరాశపరుస్తోంది.
అందుకే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకూ ‘మోనార్క్, టార్చ్ బేరర్, గాడ్ ఫాదర్, సూపర్ మ్యాన్ , డేంజర్’ లాంటి టైటిల్స్ వినిపించాయి. కానీ ఇందులో ఏదీ ఈ సినిమా టైటిల్ గా చిత్ర యూనిట్ ధ్రువీకరించలేదు. ఎట్టకేలకు దీనికి అభిమానులు పండగ చేసుకొనే ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారని.. దాన్ని ఏప్రిల్ 13న అంటే ఉగాది సందర్భంగా రివీల్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు దీంతో పాటు టీజర్ ను కూడా విడుదల చేస్తారట.
Also Read : బాలయ్య అఘోరా పాత్రను తొలగించారా?