పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి .. ప్రస్తుతం వరుసగా రెండు సినిమాల్ని విడుదలకు సిద్ధం చేశాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ మూవీ నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ మూవీ కాగా.. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించిన అరణ్య మూవీ పూర్తిగా అడవుల నేపథ్యంలో నిర్మించబడిన సినిమా. ఈ రెండు సినిమాలు ఇంచుమించు నెల రోజుల తేడాతో విడుదల కానున్నాయి. ఈ రెండూ కాకుండా.. రానా ఇప్పుడు మరికొన్ని సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు.
అందులో ఒక సినిమా 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఒక కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడట. ఇది రొటీన్ మాస్ యాక్షన్ సినిమాల స్టైల్లో కాకుండా.. డిఫరెంట్ కథతో .. వైవిధ్యమైన నేపథ్యంలో తెరకెక్కనున్న యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని సమాచారం.
Must Read ;- `అరణ్య` సినిమా అందరం గర్వపడేలా ఉంటుంది