బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. బిగ్ బాస్ షో లో టాప్ 5లో నిలిచి అందర్నీ ఆకట్టుకుంది. అరియానా బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి కారణం ఏంటి అంటే.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. గతంలో రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్ వ్యూ చేసింది. ఆ ఇంటర్ వ్యూలో అరియానా వర్మని.. ఏ అమ్మాయిని చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది అని అడిగింది.
దీనికి వర్మ ఇంకేవరు నువ్వే అని చెప్పాడు. వర్మ నుంచి ఆ ఆన్సర్ విని అరియానా షాక్ అయ్యింది. అంతే కాకుండా నిన్ను బికినీలో చూడాలనివుంది అని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. ఈ ఇంటర్ వ్యూ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించి సంచలనం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అరియానా అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ రావడంతో మాటీవీ దృష్టిలో పడింది. బిగ్ బాస్ లో పాల్గొనే లక్కీ ఛాన్స్ దక్కించుకుని మరింతగా పాపులర్ అయ్యింది.
బిగ్ బాస్ షోలో సైతం తనదైన స్టైల్ లో గేమ్ ఆడింది. ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మాటీవీలో కామెడీ షోలో పాల్గొంటూ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ అరియానా, విష్ణుప్రియ, అవినాశ్ తో పాటు గోవాకు వెళ్లింది. పనిలో పనిగా అక్కడే ఉన్న రామ్ గోపాల్ వర్మను అరియానా కలిసింది. ఈ సందర్భంగా వర్మతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: బిగ్ బాస్ వెనకున్న గాడ్ ఫాదర్ ఎవరు?