ఈ సంక్రాంతికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ .. ‘రెడ్’ అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. అయితే ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇక దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో బైలింగ్విల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల రామ్ పోతినేని, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను సమావేశమై.. తమ కలయికలో ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఓ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నారట. ఈ నేపథ్యంలో బోయపాటి .. రామ్ కు ఓ స్టోరీ నెరేట్ చేశాడట. పక్కా మాస్ కథాంశమైన అది రామ్ కు బాగా నచ్చిందట.
అన్నీ కుదిరితే .. బాలయ్య సినిమా తర్వాత బోయపాటి చేసేది ఈ సినిమా అవుతుందని టాక్. బాలయ్య, బోయపాటి సినిమాను నిర్మిస్తోన్న మిర్యాల రవీంద్రరెడ్డి రామ్, బోయపాటి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. బీబీ3 సినిమా కంప్లీట్ అవగానే… ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను బోయపాటి ప్రారంభిస్తాడట. లింగుసామి తో చేయబోయే సినిమా విడుదలయ్యాకా.. రామ్ సినిమాను బోయపాటి సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారని సమాచారం. యాక్షన్ సినిమాలు చేయడంలో మంచి పట్టు సాధించిన రామ్ .. బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద ఇప్పటి నుంచి మంచి అంచనాలు కలుగుతున్నాయి. మరి ఈ సినిమాతో రామ్ కు బోయపాటి ఏ రేంజ్ లో మాస్ ఇమేజ్ తెచ్చిపెడతాడో చూడాలి.
Must Read ;- బాలయ్య అఘోరా పాత్రను తొలగించారా?