కరోనా మహమ్మారి రెండు తెలుగు రాష్ట్రాలలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో సామాన్య ప్రజలు మాత్రమే గాకుండా ప్రజా ప్రతినిధులు, సినిమా ప్రముఖులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘తీన్మార్’ వార్తలతో ‘బిత్తిరి సత్తి’ గా పేరు తెచ్చుకున్న రవి కరోనా బారిన పడ్డారు. బిత్తిరి సత్తికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోని విడుదల చేసిన ఆయన తనకు కరోనా ఎక్కడ సోకిందో అర్ధం కావడం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా బాడీ పెయిన్స్ తో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలలో ఆయనకు కరోనా నిర్దారణ అయింది. సత్తి పోస్ట్ చేసిన వీడియో అభిమానులను ఎమోషన్ కు గురిచేసింది. ఆయన ప్రస్తుతం సాక్షి ఛానల్ లో ‘గరం గరం’ వార్తలను ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ వీడియో ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఈ కార్యక్రమానికి సత్తితో బాటు దివ్య, వాణి అనే ఇద్దరు యాంకర్స్ పని చేస్తున్నారు. రవికి కరోనా సోకడంతో ఆ లేడీ యాంకర్లు కూడా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వీరు క్వారంటైన్‌లో ఉండటంతో ‘గరం గరం’ ప్రోగ్రాం ఆగిపోనుందని వార్తలు వినబడుతున్నాయి.