టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ‘మహానటి’ మంచి విజయం సాధించగా ఎన్టీఆర్ బయోపిక్ గా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు ఇచ్చిన స్పూర్తితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బయోపిక్ గా ‘యాత్ర’ సినిమాలు వచ్చాయి. ఈ కోవలోనే తెలుగు అమ్మాయి మాధవిలత బయోపిక్ లో నటించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకే ఒక క్యారెక్టర్ తో వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామాకు “లేడీ ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఏ రియల్ లైఫ్ ఆఫ్ రీల్ స్టార్ అనేది ట్యాగ్ లైన్. రియల్ లైఫ్ అంటూ కాప్షన్ ఇవ్వడంతో ఆ స్టార్ ఎవరనే చర్చ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా మాధవిలత జీవితకథగా తెరకెక్కిందని తెలుస్తోంది. తన జీవిత కథలో తానే ఆమె నటించారని తెలుస్తోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించడం ఆ తరువాత పొలిటికల్ లైఫ్ లోకి టర్నింగ్ తీసుకోవడం లాంటి విషయాలపై ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
మాధవిలత హీరోయిన్ గా ‘నచ్చావులే’, ‘స్నేహితుడు’, ‘అరవింద్ 2’ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. సరైన విజయాలు లేకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. చాలా రోజుల తరువాత ఆమె ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో గుంటూరు-2 నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. తన లోని భావాలను వెల్లడించడానికి సోషల్ మీడియా ప్లాటుఫామ్ ను ఎంచుకున్నారు. ప్రతి విషయంపై తన అభిప్రాయాలను చెబుతున్న మాధవీలతపై తాజాగా కేసు నమోదైంది. ఫేస్‌బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు మాధవిలతను త్వరలో పోలీసులు విచారించనున్నారు.










