చంద్రబాబు ప్రాజెక్టుల టూరుతో, జగన్ బేజారు
వైసిపి నవ రత్నాల్లో 4వ రత్నం జలయజ్ఞం గత 4ఏళ్లలో నవ్వులపాలైంది..వైఎస్సార్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామన్న హామీని జగన్ తుంగలో తొక్కారు..ఓదార్పుయాత్రలో, పాదయాత్రలో చేసిన ప్రసంగాలన్నీ గాలికే పోయాయి. చెప్పింది చేయడని, చేసేది చెప్పడని మరోసారి రుజువైంది. జలయజ్ఞం కాస్తా జలభగ్నం అయ్యింది.
‘‘భగీరథుడు చంద్రబాబు- భస్మాసురుడు జగన్’’ అనే చర్చకు తెరలేపారు..టిడిపి హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులెలా పరుగులెత్తిందీ, ఈ 4ఏళ్లలో ప్రాజెక్టులెలా పడకేసిందీ జనం కళ్లముందే ఉంది..ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటినుంచి ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరడంతో జగన్ బేజారెత్తుతున్నారు, వైసిపి శిబిరంలో కల్లోలం నెలకొంది.
పోలవరానికి పట్టిన శని జగన్ అని, రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నిప్పులు చెరగడం, వరుస ప్రెస్ మీట్లతో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తెలిసిందే.. పెన్నా టు వంశధార వరకు తెలుగుతల్లికి జలహారం పేరుతో కర్నూలు నుంచి శ్రీకాకుళం 10రోజుల రాష్ట్రవ్యాప్త పర్యటన సంచలనం కానుంది. మొదటి 4రోజుల్లో కర్నూలు,కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రాజెక్టులు సందర్శిస్తారు. ప్రాజెక్టుల సందర్శనతో పాటు రోడ్ షోలు, బహిరంగ సభలతో జగన్మోహన రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ 68,283కోట్లు ఖర్చుచేస్తే, జగన్ సీఎం అయ్యాక గత 4ఏళ్లలో రూ 22,165కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. సీఎంగా చంద్రబాబు 62ప్రాజెక్టులు చేపట్టి 24పూర్తిచేస్తే, జగన్ వచ్చాక ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.
రాయలసీమలో టిడిపి 5ఏళ్లలో రూ 12,441కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి ఖర్చుచేసింది కేవలం రూ 2,011కోట్లే.అంతే కాకుండా 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసి రాయలసీమకే తీరని ద్రోహం చేశారు.. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు- నగరి 2020కల్లా పూర్తిచేస్తానన్న జగన్ హామీ నెరవేరలేదు. తెలుగుగంగపై టిడిపి హయాంలో రూ 504కోట్లు ఖర్చుచేస్తే వైసిపి చేసింది రూ 383కోట్లు మాత్రమే. హంద్రీ-నీవా సుజల స్రవంతిపై టిడిపి రూ 4,182కోట్లు ఖర్చుచేస్తే వైసిపి చేసింది రూ 515కోట్లు మాత్రమే..గాలేరు-నగరి సుజల స్రవంతికి టిడిపి ప్రభుత్వం రూ 1,546కోట్లు ఖర్చుచేస్తే వైసిపి చేసిన ఖర్చు కేవలం రూ 443కోట్లు..ఎస్సార్బీసి పనులు టిడిపి 93%చేస్తే, మిగిలిన 7%పనులు ఈ 4ఏళ్లలో పూర్తిచేయడానికి చేతులు రాలేదు. ముచ్చుమర్రికి టిడిపి ప్రభుత్వం రూ 549కోట్లు ఖర్చుచేస్తే వైసిపి వచ్చాక రూ 5కోట్లా ఖర్చుపెట్టేది..? మడకశిర బ్రాంచ్ కెనాల్ కు టిడిపి రూ 806కోట్లు ఖర్చుచేస్తే ఈ 4ఏళ్లలో రూపాయి ఖర్చుపెట్టలేదు..
భైరవానితిప్ప ప్రాజెక్టు, హై లెవల్ కెనాల్(హెచ్ ఎల్ సి) ఆధునీకరణ పనులన్నీ ఆపేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గుండ్రేవుల, ఆర్డీఎస్ (రాజోలిబండ మళ్లింపు పథకం) ఆపేశారు. వేదవతి, సిద్దాపురం పనులన్నీ నిలిపేశారు.
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 620రోజులైంది..60మంది చనిపోయారు. ఇప్పటికీ ఇళ్లు కట్టించలేదు, పునరావాసం లేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం ఉందో తెలుస్తోంది.
కోస్తాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం రూ 21,447కోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన రెడ్డి వచ్చాక ఖర్చుచేసింది రూ 4,375కోట్లు మాత్రమే.. పులిచింతలపై టిడిపి హయాంలో రూ 1,174కోట్లు ఖర్చుచేస్తే వీళ్లు చేసింది రూ 40కోట్లు మాత్రమే..వంశధార 2వ దశపై టిడిపి రూ 871కోట్లు ఖర్చుచేస్తే ఈ 4ఏళ్లలో పెట్టింది రూ 352కోట్లు..తోటపల్లి బ్యారేజిపై టిడిపి రూ 256కోట్లు ఖర్చుచేస్తే వైసిపి పెట్టిన ఖర్చు రూ 56కోట్లు..మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుపై టిడిపి రూ 553కోట్లు ఖర్చుపెడితే, ఈ 4ఏళ్లలో రూ 9కోట్లు పెట్టలేదు. పురుషోత్తపట్నంపై టిడిపి రూ 1578కోట్లు ఖర్చుచేస్తే, ఈ 4ఏళ్లలో చేసిన ఖర్చు రూ 126కోట్లు… చింతలపూడి ఎత్తిపోతలకు టిడిపి రూ 2289కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి వచ్చాక చేసింది రూ 650కోట్లు మాత్రమే..పుష్కర ఎత్తిపోతలకు టిడిపి రూ 140కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి రూ 54కోట్లు పెట్టింది.. తాడిపూడి ఎత్తిపోతలపై టిడిపి రూ 96కోట్లు పెడితే, వైసిపి పెట్టింది రూ 27కోట్లు మాత్రమే. తారకరామ తీర్ధ, హిర మండల రిజర్వాయర్, రైవాడ రిజర్వాయర్ పనులన్నింటినీ ఆపేశారు.
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై టిడిపి రూ 1414కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి వచ్చాక పెట్టింది రూ 953కోట్లు..గుండ్లకమ్మ రిజర్వాయర్ కు టిడిపి రూ 81కోట్లు ఖర్చుచేస్తే వైసిపి చేసింది రూ 22కోట్లు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 15ఏళ్లు కాకముందే గేట్లన్నీ తుప్పు పట్టాయి. 12గేట్లు బాగుచేయాలి, ఒక గేటు కొట్టుకుపోయినా బాగుచేసే దిక్కులేదు. 3వ గేటు కొట్టుకుపోతే స్టాప్ లాగ్ పెట్టేలోపే రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయ్యింది,స్టాప్ లాగ్ పెట్టినా నీరు లీకవ్వడం తెలిసిందే. బాగుచేసిన 2గేట్లకు బిల్లులు పెండింగ్ పెడితే, మిగిలిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లెలా ముందుకొస్తారు..? గేట్ల మరమ్మతులకు అంచనాలిచ్చి 3ఏళ్లయినా అతీగతీలేదంటే అదీ గుండ్లకమ్మ ప్రాజెక్టుపై, ప్రకాశం జిల్లాపై సీఎం జగన్ చిత్తశుద్ది..నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టులపైనా అదే పరిస్థితి..
ఆధునీకరణ పనులనూ తీవ్రనిర్లక్ష్యం చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు టిడిపి రూ 813కోట్లు పెడితే, వైసిపి పెట్టింది రూ 123కోట్లే..కృష్ణా డెల్టా ఆధునీకరణకు టిడిపి రూ 1239కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి పెట్టింది రూ 204కోట్లే..గోదావరి-కృష్ణా-పెన్నా వరద నియంత్రణపై టిడిపి రూ 701కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి చేసిన ఖర్చు రూ 80కోట్లు.
పోలవరం ప్రాజెక్టుకు జగనే శని..15నెలల పాటు పనులన్నీ ఆపేసి, కాంట్రాక్టర్లను మార్చి, రివర్స్ టెండరింగ్ పేరుతో అంతా అస్తవ్యస్తం చేశారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలు పూర్తిచేయలేదు, దీంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. పనులు ఆపేస్తే ప్రాజెక్టు దెబ్బతింటుందని పిపిఏ హెచ్చరించింది, లేఖ రాసింది, దెబ్బతింటే ఎవరిది బాధ్యత, పాత కాంట్రాక్టర్ దా, కొత్త కాంట్రాక్టర్ దా అని నిలదీసింది, అన్నింటినీ బేఖాతరు చేశారు..
టిడిపి 5ఏళ్లలో రూ 11,537కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి 4ఏళ్లలో చేసిన ఖర్చు రూ 4,611కోట్లు మాత్రమే..తొలిదశ ముసుగులో పోలవరం ఎత్తు 45.72మీ నుంచి రూ 41.15మీటర్లకు తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్వాసితుల పునరావాసం కోసం టిడిపి ప్రభుత్వం రూ 4,114కోట్లు పెడితే, వైసిపి చేసింది రూ 1,890కోట్లు..
ఈ 4ఏళ్లలో 4సార్లు గడువులు మార్చారు, 2021ఏప్రిల్ అన్నారు, 2021 డిసెంబర్, 2022ఏప్రిల్, 2022డిసెంబర్ అని 4సార్లు డెడ్ లైన్లు మార్చి, ఇప్పుడెప్పటికి పూర్తవుద్దో చెప్పలేమని చేతులెత్తేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం పనులు పరుగులు తీయించారు. 23సార్లు ఫీల్డ్ విజిట్స్ చేసిన సిఎం చంద్రబాబు..82సార్లు వర్చువల్ విజిట్స్, వారం వారం సమీక్షలు..సోమవారాన్ని పోలవారం చేశారు(ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పులవారం చేసినట్లు)..24గంటల్లో 35వేల క్యూమీ కాంక్రీటు వేయడం గిన్నెస్ రికార్డు..ఒక స్ఫూర్తితో, రెట్టించిన ఉత్సాహంతో పనులు చేస్తే ఇప్పుడన్నీ ఆపేసి పాడుబెట్టారు..ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి శ్రీకాకుళం 10రోజులపాటు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘‘భగీరథుడు చంద్రబాబు-భస్మాసురుడు జగన్’’ అనే చర్చకు ఈ పర్యటన నాంది పలికింది.
ఆధునిక దేవాలయాలుగా పేరొందిన నీటిపారుదల ప్రాజెక్టులపై దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత శీతకన్ను వేయడం, ఈవిధంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం..ఆలయాన్ని పాడుబెడితే అరిష్టం..అలాంటిది ఆధునిక దేవాలయాల్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పాడుబెడితే సమాజానికే అరిష్టం..దీనికి తగ్గ మూల్యం జగన్మోహన రెడ్డి ప్రభుత్వం చెల్లించకతప్పదు.