సీఎం జగన్ మోహన్ రెడ్డి నారా లోకేష్ మేనియా పట్టుకుంది. నారా లోకేష్ కి ప్రజల్లో వస్తున్నా ఆదరణ చూస్తుంటే తమ ఓటమి తప్పదని వైసీపీ నాయకులూ జగన్ దగ్గర వాపోతున్నారని తెలుస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర ఎక్కడికెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా లోకేష్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
వైసీపీ అధిష్టానం నారా లోకేష్ పాదయాత్ర మీద ప్రత్యేకంగా ద్రుష్టి సారించినట్టు సమాచారం. అలాగే నారా లోకేష్ పాదయాత్ర లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రత్యేక నిఘా టీం ని కూడా ఏర్పాటు చేసాడట సీఎం జగన్ మోహన్ రెడ్డి. లోకేష్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వైసీపీ నాయకులే కావాలనే పనికట్టుకొని లోకేష్ గ్రాఫ్ పెంచిన్నటు అర్ధమవుతోంది..
అలాగే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ పనికట్టుకొని లోకేష్ మీదబురద జల్లే ప్రయత్నం చేసినా అది లోకేష్ కి పూల జల్లులా మారింది. అలాగే లోకేష్ పాదయాత్ర లో వైసీపీ చేస్తున్న అక్రమాలు, అవినీతి కుంభకోణాలు, దౌర్జన్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది, ఏ చిన్న అవకాశం దొరికినా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు..
మరోవైపు, లోకేష్.. ప్రభుత్వంలోని అన్ని వింగ్‌లమీద, అభివృద్ధి మీద తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ రంగాలతోపాటు అన్ని సామాజిక వర్గాల సమస్యలపై ఠక్కున సమాధానం ఇస్తున్నారు.. తడుముకోకుండా స్పాట్‌లో పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏయే వనరులు ఉన్నాయి, వాటి ఉపయోగం, వినియోగంపై క్షణం ఆలోచించుకోకుండా, గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు.. ఇదే యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది..
అదే జగన్ స్పీచ్‌లు ఫుల్ రివర్స్‌లో ఉన్నాయనే చర్చ సాగుతోంది.. ఆయన ప్రసంగాలలో ప్రతి అక్షరం పేపర్ లేకుండా చదవలేరు.. అధికారులు ముందే ఫీడ్ బ్యాక్ ఇస్తే ప్రసంగాలు సాగవనే ఫీల్ యువతకి చేరిపోయింది.. ఆయన స్పూన్ ఫీడింగ్ స్పీచ్‌లపై జనాలకు మొహం మొత్తేసిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.. దీంతో, జగన్, లోకేష్ స్పీచ్‌లని కంపేర్ చేసుకొని చూస్తున్న ప్రజలకు ముఖ్యంగా యువతకి.. స్పష్టమైన బేధాలు కనిపిస్తున్నాయి.. దీంతో, జగన్ తన అసమర్ధతతో, లోకేష్ గ్రాఫ్ పెంచుతున్నారని, ఆయన ఇస్తున్న ఆయాచిత వరాన్ని లోకేష్ పక్కాగా క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..మరి, లోకేష్ గ్రాఫ్ ని తగ్గించడానికి జగన్ ఎలాంటి స్కెచ్‌లు వేస్తాడో, పేటీఎమ్ బ్యాచ్‌కి ఎలాంటి స్కీమ్‌లు, ఆఫర్‌లు ఇస్తాడో చూడాలి.