( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అరకు డుముకు మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడి కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ..అరకు ఘాట్ రోడ్డులో బస్ ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి నాలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రమాదంపై ప్రభుత్వం తరుపున జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన మృత దేహాలను వారి బంధువులకు అప్పగించటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బస్సులో డ్రైవర్‌తో కలిపి మొత్తం 26 మంది
ప్రమాదం జరిగిన బస్సులో డ్రైవర్‌తో కలిపి మొత్తం 26 మంది ఉన్నారు. వీరిలో 4 గురు మృతి చెందగా..22 మంది కేజీహెచ్,2లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఐసీయులో ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన నలుగురిలో 8 నెలల నిత్య అనే చిన్నారి ఉంది.
Must Read ;- అరకు ప్రమాదం వెనుక ప్రభుత్వాల పాపం ఎంత?











