యంగ్ డైరెక్టర్ మారుతి.. యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, జీఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. అలాగే అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సాయిపల్లవి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత రాశీ ఖన్నా అనుకుంటున్నారు కానీ..ఆమె బిజీగా ఉండడంతో సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఇప్పుడు మారుతి, హీరోయిన్ కాజల్ తో వర్క్ చేయనున్నాడు అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో గోపీచంద్ తో చేస్తున్న మూవీ కోసం అనుకుంటున్నారు కానీ.. సినిమా కోసం కాదు వెబ్ సిరీస్ కోసమని తెలిసింది. అవును.. లాక్ డౌన్ టైమ్ లో మారుతి కొన్ని స్క్రిప్టులు రెడీ చేశాడు. ఆహా కోసం వెబ్ సిరీస్ చేస్తానని అల్లు అరవింద్ కి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆహా కోసం చేయనున్న మారుతి తెరకెక్కించనున్న వెబ్ సిరీస్ లో కాజల్ నటించనుందని తెలిసింది.
ఈ వెబ్ సిరీస్ టైటిల్ 3 రోజస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాజల్ ఇటీవలే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆహా కోసం వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య సినిమాని మే 13న రిలీజ్ చేయనున్నారు.
Must Read ;- కాజల్ అగర్వాల్ పేరు మార్చుకుందా.?











