ఎండాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాల్లో తాటి ముంజలు ప్రధానమైనవి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ ముంజల ద్వారా ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు మిస్ చేసుకోరు. వీటిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం చేత, వేసవి ఎండ నుంచి కాపాడుకోవడంలో తాటి ముంజలు చాలా బాగా పని చేస్తాయి. తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. వీటితో శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు వెలుపలికి తరిమేస్తాయి. వీటిని తరుచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దూరవుతాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ బారినుండి కాపాడుతుంది.
వడదెబ్బ తిగలకుండా…
తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి. వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
పోషకాలు పుష్కలం
వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబందిత సమస్యను తగ్గిస్తాయి. వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబందిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
శరీరం చల్లగా చల్లగా..
వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు బాగా సహాయపడుతాయి.
మరికొన్ని లాభాలు
రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
లివర్ ఆర్యోగ్యానికి ఇవి మంచివి.
చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది.
వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్నికూల్ గా ఉంచుతుంది.
బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Must Read ;- అంతకుముందు.. ఆ తర్వాత ఏం చేయాలి?