ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. ఒంట్లో పేరుకుపోయిన కొలస్ట్రాల్‌ని తగ్గించుకుని ఆరోగ్యంగా, సన్నగా కనిబడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ప్రస్తుతం అందరివీ బిజీ బిజీ జీవితాలైపోయాయి. కనీసం తినడానికే సమయం లేదు.. వ్యాయామాలు కూడానా.. అనేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారి కోసమే.. ఈ 5 వ్యాయామాలు. జిమ్ పరికరాలతో పనిలేదు.. అటు.. ఇటు పరిగెత్తాల్సిన పనిలేదు. కేవలం కొన్ని నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. ఉన్న చోటే కాస్త ఒళ్లు వంచితే.. ఒంట్లోని కొవ్వును ఐస్‌లా కరిగించేయచ్చు. కానీ ప్రతిరోజు తప్పకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది. కాకపోతే.. వ్యాయామంతోపాటు సరైన డైట్ పాటించడం మరిచిపోకండి.
1.ప్లాంక్..
నేలపై బొర్లా పడుకుని మోచేతులను 90 డిగ్రీలలో పెట్టి.. పాదాలను మునివేళ్లపై నిలిపి.. వాటి ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో 30 సెకన్లపాటు ఉండడానికి ప్రయత్నించాలి. క్రమంగా సమయాన్ని పెంచుకుంటూపోవాలి.
Must Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!

ఉపయోగాలు
ఇది చూడడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ చేయడం అంత సులభమైతే కాదండోయ్.. ఈ వ్యాయామం పొట్ట భాగంలోని కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని కండరాలు గట్టిపడేలా చేస్తుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా ఈ వ్యాయామం ద్వారా నేర్చుకోవచ్చు. తొడల భాగంలోని కొవ్వును కరిగించడంలో కూడా ఈ వ్యాయామం చక్కగా ఉపకరిస్తుంది.
2.పుషప్స్..
నేలపై బోర్లా పడుకుని.. పాదాలను మునివేళ్లపై నిలిపి.. అరచేతులను నేలకు ఆన్చి పెకి కిందకి చేతుల ఆధారంగా కదులుతూ వ్యాయాయం చేయాలి. ఇలా 30-45 సార్లు చేయాలి. ఇది చేయడానికి మీకు కేవలం 60 సెకన్లకు మించి ఎక్కువ సమయంపట్టదు.
Also Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

ఉపయోగాలు..
శరీరంలోని ప్రతి భాగానికి ఒకే సమయంలో వ్యాయామం అందించాలనుకుంటే.. పుషప్స్ మంచి ఎంపిక. చేతి కండరాలు, కాలి భాగంలోని కండరాలు, పొట్ట భాగంలోని కండరాలు గట్టి పడడానికి చక్కగా ఉపకరిస్తుంది ఈ వ్యాయామం. అంతేకాదు, ఈ వ్యాయామం చేయడానికి ఎటువంటి పరికరాలు అవసరం ఉండవు.
3.స్క్వాట్స్..
ముందుగా రెండు కాళ్ల మధ్య కొంచెం దూరం ఉండేటా నిటారుగా నిలబడాలి. గోడ కుర్చీ వేసినట్లుగా .. మెల్లగా కిందకి కూర్చోవాలి. అలాగని పూర్తిగా నేలపై కూర్చోకూడదు. మోకాళ్ల ఎత్తు కంటే కాస్త కిందికి కూర్చుని.. అలాగే కొన్ని సెకన్లపాటు ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మెల్లగా లేచి నిలబడాలి. ఇలా 25-30 సార్లు చేయాలి.
Also Read ;- డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?

ఉపయోగాలు..
శరీరానికి బ్యాలెన్సింగ్ రావాలంటే, స్క్వాట్స్ చేయడం తప్పనిసరి. తొడలు, మోకాళ్ల కింది భాగంలో కాళ్లలో పేరుకుపోయిన కొవ్వు కరిగి కండరాలు గట్టిపడడానికి ఈ స్వ్కాట్స్‌ని తప్పనిసరిగా ఒక క్రమపద్ధతిలో చేస్తే సరిపోతుంది. దీనితోపాటు నడుము భాగంలోని కొవ్వును కరిగించాలంటే స్వ్కాట్స్ ఉత్తమమైన వ్యాయామని చెప్పచ్చు.
4.ద బర్డ్-డాగ్..
నేలపై బోర్లా పడుకుని.. కాళ్లను మునివేళ్లపై నిలబెట్టి.. మోకాలిపై పడుకున్నట్టుగా భంగిమ పెట్టి.. చేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి. ఇప్పుడు కలి కాలిని వెనకకు నేరుగా చాపాలి. అదే విధంగా, కుడి చేతిని కూడా నేరుగా చాపాలి. ఈ భంగిమను ఎడమ కాలు, చేతితో నియంత్రించుకుంటూ కొన్ని సెకన్లపాటు నిలబడడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇదే భంగిమను ఎడమవైపు చేసి, కుడి భాగంతో బ్యాలెన్స్ చేయగలగాలి.
Also Read ;- ‘తల్లిపాల’ను పెంచే సూపర్ ఫుడ్స్

ఉపయోగాలు..
శరీరానికి బ్యాలెన్సింగ్ అందిస్తుందీ వ్యాయామం. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. నడుము, పొట్ట భాగంలోని కండరాలు బలంగా తయారవుతాయి. పిరుదల భాగంలోని కొవ్వును కరిగించడానికి ఈ వ్యాయామం చక్కగా ఉపకరిస్తుంది. ఏ పరికరాలు అవసరం లేదు గనగ.. ఇంట్లోనే చేసుకోవచ్చు.
5.గ్లూట్ బ్రిడ్జ్..
నేలపై పడుకుని.. చేతులను నేలపై సమాంతరంగా చాపాలి. ఇప్పుడు మోకాళ్లను వంచి నడుము భాగాన్ని పైకెత్తి బ్రిడ్జ్‌లాగా వాలుగా పెట్టాలి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు అలాగే పట్టి ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా 10-15 సార్లు చేయాలి. క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు.
Also Read ;- ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

ఉపయోగాలు..
నడుము భాగం, పొట్ట భాగాల్లోని మొండి కొవ్వును కరిగించి.. అక్కడి కండరాలు గట్టిపడేలా చేస్తుందీ బ్రిడ్జ్ వ్యాయామం. వీటితోపాటు.. తొడల భాగానికి, పిరుదులకు మంచి వ్యాయామం ఈ గ్లూట్ బ్రిడ్జ్.
చూశారుగా.. ఉన్నచోట నుండి కదలాల్సిన పనిలేకుండా ఒళ్లు వంచి మంచి షేప్‌ను ఎలా సొంతం చేసుకోవచ్చో.. కానీ, ఇక్కడ మరొక విషయం మరిచిపోకండి. ఎన్ని వ్యాయామాలు చేసినా.. డైట్ పాటించకపోతే.. ఫలితం మాత్రం శూన్యమని మరిచిపోకండి. కీళ్ల నొప్పులు, వెన్నుముక సమస్య వంటివి ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు ఇలాంటి వ్యాయామాలు చేయడం మంచిది.
Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?











