ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ పార్థీవ దేహానికి చంద్రబాబు, లోకేశ్, పలువురు తెలంగాణ మంత్రులు నివాళులర్పించి ఆర్కేను పరామర్శించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ ఎన్వీ రమణ తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. వేమూరి రాధాకృష్ణతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ తన సానుభూతి తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ రావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తదితరులు పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఎదుగుదలలో రాధాకృష్ణకు కనకదుర్గ అనుక్షణం తోడుగా నిలిచారని పేర్కొన్నారు. వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి , అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలవీరంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణరెడ్డి సంతాపం తెలిపారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు సుజనా చౌదరి ఫోన్‌లో పరామర్శించారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఈటల, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, ఏపీసీసీ అధ్యక్షులు డా.శైలజానాధ్, మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి,ఎంఎల్ సి దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, భూమా అఖిల ప్రియా, పీతల సుజాత,మాజీ స్పీకర్ ప్రతిభాభారతి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ , ఏపీయుడబ్ల్యూ జె అధ్యక్షుడు ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ డిసిసిబి ఛైర్మన్ మువ్వ విజయ్ బాబు నివాళులు అర్పించారు. అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ కృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, కెయస్ జవహర్, కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు సంతాపం ప్రకటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు.
Must Read ;- వేమూరి రాధాకృష్ణ భార్య మృతికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం