కూల్ డ్రింగ్స్, ఆల్కాహాల్ తాగే బదులు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి గుండెను కాపాడేస్తాయి. బాడీలో హీట్ తగ్గిస్తాయి. దాహం సమస్యను చెక్ పెడతాయి. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లును దూరంగా ఉంచుతారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయంతో కొబ్బరి నీళ్లు తాగకుండా దూరం పెడతారు. అయితే అలాంటివన్ని కేవలం అపోహలే అని పరిశోధకులు వెల్లడించారు. కొబ్బరి నీళ్లు తాగేవారిలో షుగర్ లెవల్స్ పెరగవని.. తగ్గుతాయని వారు పేర్కొన్నారు.
పరిగడుపున తాగితే…
- కొబ్బరి నీళ్లను పరగడుపున తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. దీంతో శరీరంలో ఉన్న ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
- శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి, కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
- మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నరాల సంబంధ సమస్యలు తొలగిపోతాయి.కండరాలకు పుష్టి కలుగుతుంది.
- గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. కొబ్బరినీళ్లలో సైటోకినిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి.
- జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ప్రధానంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. బీపీ అదుపులోకి వస్తుంది.
- ఇప్పటి వేసవికాలంలో కొబ్బరి నీరు రోజూ తాగడం వలన శరీరానికి చల్లదనం లభిస్తుంది. శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలతో కొబ్బరి నీరు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- అజీర్తి సమస్యలతో బాధపడేవారు గ్లాస్ కొబ్బరి నీరు తాగితే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. గ్లాస్ కొబ్బరి నీటిరు తాగుతుంటే.. ఈ వేసవిలో శరీరానికి కావలసిన ఎనర్జీ పుష్కలంగా అందుతుంది.
- Must Read ;- మట్టినీరే.. మహాఔషధం!











