నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది. బీబీ 3 గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మే 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ బ్లాక్ బస్టర్స్ అయిన సేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య రెండు పాత్రలతో అభిమానుల్ని అలరించబోతున్నారు. అందులో ఒకటి అఘోరా అని, మరొకటి ఐఏయస్ ఆఫీసర్ పాత్ర అని ప్రచారంలో ఉండగా.. అఘోరా పాత్రను పూర్తిగా మార్చేసి.. మళ్ళీ రీషూట్ప్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉగాది కి అఫీషియల్ గా టైటిల్ ను ప్రకటిస్తారట. ఇదిలా ఉంటే.. హోలీ సందర్భంగా .. బీబీ3 సెట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. బాలయ్య, బోయపాటి తో పాటు ఇందులో నటించిన కొందరు నటీమణులు రంగులు చల్లుకొని హల్ చల్ చేశారు. ముఖ్యంగా బేబీ దేశ్నా అనే పాప అందరికీ రంగులు పూసి అల్లరి చేయడం ఆకట్టుకుంటోంది. ఇక బాలకృష్ణ అద్భుతమైన మేకోవర్ తో ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం బీబీ 3 హోలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;- ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్సిచ్చిన బాలయ్య











