టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లిస్ట్ లో బాలయ్య, బోయపాటి మూవీ ఒకటి. బీబీ 3 గా చెలామణి అవుతోన్న ఈ సినిమా మే 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ధారించకపోవడం అభిమానుల్ని కాసింత అసహనానికి గురి చేస్తోంది. సింహా, లెజెండ్ సూపర్ హిట్టైన నేపథ్యంలో బాలయ్య, బోయపాటి కలయికలో వస్తోన్న మూడో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఎంత లేటైనా.. పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారట మేకర్స్.
ముందుగా బీబీ 3 కోసం ‘మోనార్క్, టార్చ్ బేరర్, డేంజర్’ లాంటి టైటిల్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా ప్రచారం లోకొచ్చింది. అయితే వీటిలో మోనార్క్ టైటిలే అన్ని విధాల బెస్ట్ అని అనుకుంటూ ఉండగా.. ఇప్పుడు గాడ్ ఫాదర్ టైటిల్ నే ఫైనల్ చేయబోతున్నారని టాక్. ఎందుకంటే.. ఆ టైటిల్ సినిమా కథ ప్రకారం చాలా యాప్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారట. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా టీజర్ త్వరలోనే విడుదల కాబోతోందట. ఈ లోపే టైటిల్ సెలెక్షన్ జరిగితే బాగుంటుందని చూస్తున్నారట. మరి గాడ్ ఫాదర్ గా బాలయ్య ఏ రేంజ్ లో అదరగొడతారో చూడాలి.
Must Read ;- బాలయ్య బోయపాటి సినిమా టైటిల్ రివీల్ అయ్యేది అప్పుడేనట.. !