టాలీవుడ్ లో ఒకప్పుడు కొన్ని సినిమాలతో సక్సెస్ సాధించి.. ఇప్పుడు పూర్తిగా వెనుకబడిన దర్శకుడు శ్రీవాస్. పెద్ద హీరోల చిత్రాల్ని డైరెక్ట్ చేసినప్పటికీ.. ఇతడికి లక్ మాత్రం కలిసిరాలేదు. ఈ దర్శకుడు చివరగా .. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘సాక్ష్యం’ అనే మూవీ తీశాడు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చతికిలపడింది. ఇప్పుడు శ్రీవాస్ .. దర్శకుడిగా మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు. అందుకే కొంత కాలంగా ఓ స్టోరీ రాసుకొని బాలయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం.
బాలకృష్ణతో శ్రీవాస్ గతంలో ‘డిక్టేటర్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. అందుకు అతడి పనితనం తెలిసిన బాలయ్య .. అతడి కథకి ఓకే చెప్పాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. బాలయ్య అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కానీ.. బాలకృష్ణ శ్రీవాస్ కేసి చూడరు. మరి అంతవరకూ శ్రీవాస్ వెయిట్ చేస్తాడో లేదో చూడాలి.