తిరుపతిలో పొలిటికల్ హీట్ పెరిగింది. సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని ప్రధాన పార్టీలు ఒకరికొకరుపై విమర్శలకు దిగుతున్నాయి. నిన్న వైసీపీ, టీడీపీ మధ్య వాట్సాప్ వార్ నడిస్తే, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ లక్యంగా ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై, గతంలో పనబాక లక్ష్మీ చేసి వీడియోను ట్వీట్ చేశారు. తిరుపతి లోక్ సభ స్థానాన్ని దక్కించుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కోలా అస్త్రాలు సంధిస్తున్నాయి. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Must Read ;- పవనే తమ సీఎం అభ్యర్థి.. సోము మాటలతో జన సైనికులు ఖుష్
తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీ గారు టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. సమర్పిస్తున్న తెలుగుదేశం @JaiTDP.#BJP4Tirupati#BJP_JanaSena4AndhraPradesh@PanabakaLakshmi pic.twitter.com/t5Q5zJj6hz
— Somu Veerraju (@somuveerraju) March 30, 2021