How Does Raj Kundras Arrest Impact Shilpa Shetty’s Hungama 2 Release :
ఒక ఇంట్లో ఎవరైనా తప్పుచేస్తే అది ఆ ఇంటి సభ్యుల మెడకు చుట్టుకోకుండా ఎలా ఉంటుంది? శిల్పాశెట్టి విషయంలో అదే జరిగింది. పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ఎవరంటే శిల్పాశెట్టి భర్తగానే ఎవరైనా చెబుతారు. యోగా పేరుతో ఆమె అందాలను విరజిమ్ముతూ నేటికీ గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘హంగామా 2’ చిత్రంలో నటించింది. ఈ సినిమా జులై 23న విడుదల కావలసి ఉంది. రాజ్ కుంద్రా వివాదంలో ఈ సినిమా విడుదల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి.
డిస్నీప్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. తమ హంగామా 2 చిత్రం మీద రాజ్ కుంద్రా ఏ మాత్రమూ పడబోదని ఈ సినిమా నిర్మాత రతన్ జైన్ అంటున్నారు. అరెస్ట్ అయ్యింది శిల్ప భర్తే కానీ శిల్ప కాదు అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో శిల్ప పేరును బయటకు లాగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో శిల్ప పాల్గొంది. పోర్న్ వీడియోల వ్యవహారంలో శిల్ప పాత్ర ఏమన్నా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఇప్పటిదాకా ఆమె పాత్రకు సంబంధించిన ఆధారాలేమీ దొరికినట్టు లేదు. హంగామా 2 సినిమా బాగా వచ్చిందని, ఇందులోని కంటెంట్ కోసమే జనం చూస్తారు తప్ప వివాదం కోసం కాదని రతన్ జైన్ అన్నారు. జులై 23న విడుదల ఉంటుందని చెప్పారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత ఆమెతో టచ్ లో ఉన్నారా అని ఓ మీడియా ప్రతినిధి రతన్ జైన్ ను ప్రశ్నిస్తే ‘లేదు.. నేను ఆమెతో మాట్లాడలేదు. ఆమె సమస్యల్లో ఉంది. ఆమెను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’అని ఆయన సమాధానం చెప్పారు. ఎలాంటి కేసులు ఉన్నా సినిమాల మీద మాత్రం ప్రభావం ఉండవని ఆయన అన్నారు.
గతంలో డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న సూపర్ స్టార్ లతో తాను చిత్రాలు నిర్మించానని, వారిపై కూడా నేరాలు రుజువు కాలేదని, జనం కూడా ఆ విషయాన్నిమరచిపోయారని రతన్ జైన్ అన్నారు. కేవలం ఇది మీడియా హైప్ గా కొట్టిపారేశారు. రాజ్ కుంద్రా చేసింది చట్టవిరుద్ధమని రుజువు కాలేదని, ఆ విధమైన తీర్పు వచ్చినప్పుడే తాము స్పందిస్తామని అన్నారు. పోలీసులు తమ పని తాము చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ హంగామా 2 సినిమాలో శిల్పా శెట్టితో పాటు పరేష్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణితా సుభాష్ తదితరులు నటించారు. కామెడీ సినిమాగా ఇది తెరకెక్కింది. జనం నుంచి దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Must Read ;- అరెస్టు కాకుండా రాజ్ కుంద్రా రూ. 25 లక్షల లంచం?











