తమిళ హీరో కార్తి .. ఇటీవల ‘సుల్తాన్’ మూవీతో ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించాడు. తెలుగులో సినిమా యావరేజ్ అనిపించుకున్నప్పటికీ.. తమిళంలో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్తీ చేతిలో పలు చిత్రాలున్నాయి. వాటిలో ‘సర్దార్’ ఒకటి. విశాల్ తో ‘అభిమన్యుడు’ లాంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ను రూపొందించి సూపర్ హిట్ సొంతం చేసుకున్న పి.యస్.మిత్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కార్తీ వయసు మళ్ళిన పాత్రను పోషించబోతున్నాడని .. ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి అర్ధమవుతోంది. అలాగే మోషన్ పోస్టర్ తో కూడిన వీడియో ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్తి సర్దార్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లోనూ లుక్స్ ను విడుదల చేశారు.
సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో గుబురు గెడ్డంలో రివీలైన కార్తీ.. ఒక సస్పెక్ట్ అని అర్ధమవుతోంది. ఏదో కేస్ లో అరెస్ట్ అయిన అతడ్ని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారని అతడి డ్రెస్ ను బట్టి ఊహించవచ్చు. తిరుకురళ్ 585ను కోట్ చేస్తూ.. వివిధ దేశాలకు సంబంధించిన నేరస్థుల్ని చూపిస్తూ… మోషన్ పోస్టర్ రూపుదిద్దుకుంది. రాశీ ఖన్నా, మలయాళ బ్యూటీ రజిషా విజయన్ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. మరి సర్దార్ సినిమా కార్తీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read : తెలుగులో మళ్లీ ఐటెమ్ సాంగ్ కు రత్తాలు రెడీ .. !