రౌడీ హీరో విజయ దేవరకొండ ప్రస్తుతం .. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై .. కరణ్ జోహార్, అపూర్వ మెహతా తో సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. బాక్సింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పక్కా యాక్షన్ మూవీగా ‘లైగర్’ తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను పాల్కన్ సంస్థ అత్యంత భారీగా సినిమాను నిర్మించబోతోంది.
ఇక యువ సుధ ఆర్ట్స్, యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా కొరటాల శివ దర్శకత్వంలో యన్టీఆర్ 30వ సినిమాను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. అయితే ఇదే సంస్థ విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ సినిమాను ప్లాన్ చేశారట. దీనికి భీష్మ ఫేమ్ వెంకీ కుడుములని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. ఈ విషయమై దర్శకుడు కొరటాల .. హీరో విజయ్ దేవరకొండను సంప్రదించారట.
అయితే కొరటాలకి విజయ్ దేవరకొండ నో చెప్పి షాకిచ్చాడట. మరో రెండు మూడు సంవత్సరాల వరకూ తన డైరీ ఖాళీ లేదని, వరుస సినిమాలతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని విజయ్ చెప్పాడట. అందుకే కొరటాల లాంటి దర్శకుడు రాయబారం జరిపినప్పటికీ .. విజయ్ దేవరకొండ సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించాడని వినికిడి. ఎంత కాల్షీట్స్ ఖాళీ లేకపోయినా.. కొరటాల లాంటి దర్శకుడు .. రికమెండేషన్లో .. వెంకీ కుడుముల లాంటి హిట్ దర్శకుడి సినిమాను విజయ్ దేవరకొండ ఎందుకు తిరస్కరించాడో అంతుచిక్కడం లేదట. మరి దానికి కారణం ఏమై ఉంటుందో .
Must Read : ‘లైగర్’ విజయ్ దేవరకొండ తో శివగామి